Viral News: రోడ్డుపై గుంతలు.. అధికారుల నిర్లక్ష్యం.. గంటల్లోనే మరమత్తులు చేయాల్సిన పని కల్పించిన వ్యక్తి

|

Feb 03, 2024 | 12:34 PM

మలేషియాలో ఓ రోడ్డుమీద ఉన్న గుంతలతో ఒక వ్యక్తి చాలా కలత చెందాడు. దీంతో అతను ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి ఒక ఆలోచన చేశాడు. వెంటనే తన ఆలోచనని అమలు చేశాడు. అది చూసి అధికారుల్లో కదలిక వచ్చి తక్షణమే రోడ్డు పనులు పూర్తి చేసి గుంతను సరిచేశారు. ఈ వ్య‌క్తి ఆలోచనా తీరును చూసి నెటిజన్లు ఎంతో ముగ్ధుల‌య్యారు. దీనిపై కామెంట్స్ చేస్తూ ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారు.

Viral News: రోడ్డుపై గుంతలు.. అధికారుల నిర్లక్ష్యం.. గంటల్లోనే మరమత్తులు చేయాల్సిన పని కల్పించిన వ్యక్తి
Banana Tree In The Road
Follow us on

ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లోనూ ప్రభుత్వ వ్యవస్థ పనిచేసే తీరు ఒకేలా ఉంటుంది ఏమో అనిపిస్తుంది కొన్ని కొన్ని ఘటనలు చూస్తుంటే.. ఎక్కడ చూసినా ఆ దేశ ప్రజలు తమ ప్రభుత్వం పని తీరుపై  విరుచుకుపడుతున్నారు. దీనికి కారణం పెద్ద పెద్ద సంఘటనలు కాదు.. సామాన్య ప్రజలు చిన్న విషయాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుమీద గుంతలు పడి అందులో నీరు నిల్వ ఉండడంతో ఆ రహదారిలో ప్రయాణించడం కష్టమై కొందరు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో తమ సమస్యను తీర్చమంటూ స్థానికులు ప్రభుత్వ కార్యాలయాల వద్దకు పరుగులుతీశారు. తమ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. రకరకాలుగా తమ సమస్యను ప్రభుత్వం పరిష్కరించే దిశగా ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. దీంతో ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని భావించారు. ఇపుడు అది నెట్టింట్లో ఓ రేంజ్ లో చర్చనీయాంశమైంది. ఈ ఘటన మలేషియాలో చోటు చేసుకుంది.

మలేషియాలో ఓ రోడ్డుమీద ఉన్న గుంతలతో ఒక వ్యక్తి చాలా కలత చెందాడు. దీంతో అతను ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి ఒక ఆలోచన చేశాడు. వెంటనే తన ఆలోచనని అమలు చేశాడు. అది చూసి అధికారుల్లో కదలిక వచ్చి తక్షణమే రోడ్డు పనులు పూర్తి చేసి గుంతను సరిచేశారు. ఈ వ్య‌క్తి ఆలోచనా తీరును చూసి నెటిజన్లు ఎంతో ముగ్ధుల‌య్యారు. దీనిపై కామెంట్స్ చేస్తూ ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారు.

ఎందుకు మరమ్మతులు చేయలేదంటే

సబా ప్రాంతంలోని జలన్ సండకన్ లహద్ దాతు అనే ప్రాంతంలో రోడ్డుపై గుంతల కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడేవారు. అక్కడ నివసించే ప్రజలు రోడ్లమీద గుంతలను పూడ్చి పెట్టమంటూ అధికారులకు అనేక సార్లు విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ అధికారులు సీతకన్నేశారు. తమ సమస్య అధికారులకు చెప్పి చెప్పి విసిగిపోయారు కూడా.. దీంతో మహతీర్ అరిపిన్ అనే సమస్య పరిష్కారానికి సారికొత్త ఆలోచన చేశాడు. రోడ్లమీద గుంతల్లో అరటి చెట్టును నాటి .. అధికారుల మొండి వైఖరిపై ప్రజల దృష్టి పడేలా చేశాడు.  సమస్య పరిష్కారానికి సరికొత్త మార్గాన్ని కనిపెట్టాడు.

ఇవి కూడా చదవండి

ఈ అరటి చెట్టును నాటిన తర్వాత అక్కడ ఫొటో దిగి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. ఇది సోషల్ మీడియా వినియోగదారుల దృష్టిని బాగా ఆకర్షించింది. అనంతరం సబా పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు వచ్చి రోడ్డు మరమ్మతులు చేశారు. అయితే మహిర్ తాను చేసిన పని గురించి మాట్లాడుతూ, రహదారిపై ఉన్న చిన్న, పెద్ద గుంతలు వాహనదారుల ప్రాణాలతో చెలగాడటం ఆడతాయని.. వాహనాలకు నష్టం కలిగిస్తాయని..  ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని  చెప్పారు. అందుకనే ఈ చెట్టు బహుశా ప్రమాదాలను నివారిస్తుందని తాను భావించినట్టు పేర్కొన్నారు. ఇదే విషయంపై అధికారులు మాట్లాడుతూ.. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల కారణంగా ఈ రోడ్డు మరమ్మతులు చేయడానికి వీలుపడలేదని పేర్కొన్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..