Viral Video: ద్యావుడా..! మిర్చి బజ్జీల్లా.. బొద్దింక వేపుడు ఆస్వాదిస్తున్న యువతి…

|

Feb 18, 2024 | 7:39 PM

మనమందరం సమాసా, పానీపూరీ, బజ్జీ, బోండా, వడపావ్ వంటి స్ట్రీట్ ఫుడ్ ని తినడానికి ఎలా ఇష్టపడతామో అదే విధంగా కొని దేశాలకు చెందిన ప్రజలు బొద్దింక వేపుడు, తేళ్ల ఫ్రైస్‌ని నోరూరించే ఫ్రెంచ్ ఫ్రైస్‌గా తింటారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. కంబోడియాలో స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ మ్యాన్ అమ్ముతున్న అందమైన యువతి నోరు తెరిచి క్రిస్పీ బొద్దింక వేపుడును ఆస్వాదిస్తోంది. ఈ వీడియో చూసిన చాలా మంది దేవుడా ఇదేంటి వాక్ అని అంటారు. 

Viral Video: ద్యావుడా..! మిర్చి బజ్జీల్లా.. బొద్దింక వేపుడు ఆస్వాదిస్తున్న యువతి...
Viral Video
Follow us on

సాధారణంగా మనం తినే ఆహారం ఒక్కో ప్రాంతానికి భిన్నంగా ఉంటుంది. అయితే కొన్ని దేశాల్లో తినే ఆహారం మనకు వికారం కలిగిస్తుంది. ఇప్పటికీ ఈ చిత్రాది విచిత్రమైన వంటలు , ఆహారం గురించి చెప్పాలంటే చైనా ,  కొరియా దేశాలు వెంటనే గుర్తుకు వస్తాయి. బొద్దింకలు, పాము నుంచి తేళ్లు వరకు అన్నింటిని తింటారు.  అవును మనమందరం సమాసా, పానీపూరీ, బజ్జీ, బోండా, వడపావ్ వంటి స్ట్రీట్ ఫుడ్ ని తినడానికి ఎలా ఇష్టపడతామో అదే విధంగా కొని దేశాలకు చెందిన ప్రజలు బొద్దింక వేపుడు, తేళ్ల ఫ్రైస్‌ని నోరూరించే ఫ్రెంచ్ ఫ్రైస్‌గా తింటారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. కంబోడియాలో స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ మ్యాన్ అమ్ముతున్న అందమైన యువతి నోరు తెరిచి క్రిస్పీ బొద్దింక వేపుడును ఆస్వాదిస్తోంది. ఈ వీడియో చూసిన చాలా మంది దేవుడా ఇదేంటి వాక్ అని అంటారు.

ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఒక యువతి స్ట్రీట్ ఫుడ్ గా రోడ్డు పక్కన  కూర్చొని బొద్దింక ఫ్రైస్ అమ్ముతున్నట్లు చూడవచ్చు. వైరల్ వీడియో @streetfoodjourn3y పేరుతో ఒక Instagram పేజీలో కంబోడియాలోని అత్యంత అందమైన స్ట్రీట్ ఫుడ్ విక్రేత అనే శీర్షికతో  షేర్ చేశారు.

వైరల్ వీడియోలో కంబోడియాలో రోడ్డు పక్కన కూర్చున్న ఓ అందమైన యువతి బొద్దింక ఫ్రైస్ అమ్ముతుండటమే కాదు.. ఫ్రెంచ్ ఫ్రైస్ తింటున్నట్లుగా బొద్దింక ఫ్రైస్ తింటోంది.

ఇవి కూడా చదవండి

కొద్ది రోజుల క్రితం షేర్ చేసిన ఈ వీడియోకి 44 మిలియన్ వ్యూస్, 4 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. రకరకాల కామెంట్లు కూడా వచ్చాయి. ఒక వినియోగదారు  ష్.. అసహ్యంగా ఉంది అని కామెంట్ రాశారు. ‘నేను శాఖాహారిగా పుట్టడం నా వరం’ అంటూ మరో యూజర్ ఫన్నీ కామెంట్ రాశారు. మరో వినియోగదారు మాట్లాడుతూ చైనాలో ప్రజలు ప్రతిరోజూ దీన్ని తింటారు. మరికొంతమంది ఇది చుస్తే వికారంగా అనిపించిందని అన్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..