Viral News: ఎనిమిదోసారి పెళ్లి మీద మనసు పడ్డ 112 ఏళ్ల బామ్మ.. కండిషన్స్ అప్లై..

వందేళ్లు దాటిన మనిషి తన చివరి దశలో తన కుటుంబ సభ్యుల మధ్య సంతోషంగా తుదిశ్వాస విడనాడాలని కోరుకుంటూ దైవ నామ స్మరణతో గడిపేస్తారు. అయితే ఈ శతాధిక వృద్ధురాలు  తన చివరి దశలో.. మళ్ళీ పెళ్లి చేసుకోవాలని కోరుకుంటూ.. ప్రేమకు వయస్సు లేదని నిరూపించింది. అంతేకాదు ఎవరైనా యువకుడు తన ముందుకు వచ్చి ప్రపోజ్ చేస్తేనే పెళ్లి చేసుకుంటానని వృద్ధురాలు కండిషన్ కూడా పెట్టింది.

Viral News: ఎనిమిదోసారి పెళ్లి మీద మనసు పడ్డ 112 ఏళ్ల బామ్మ.. కండిషన్స్ అప్లై..
112 Years Old Woman Siti Hava
Image Credit source: Kosmo

Updated on: Jan 12, 2024 | 4:52 PM

స్మార్ట్ ఫోన్ , ఇంటర్నెట్ , సోషల్ మీడియా ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగినా క్షణాల్లో తెలుస్తోంది. కొన్ని విషయాలు అయితే ఆసక్తి కరంగా ఉండడమే కాదు.. ఇది నిజమేనా అనిపిస్తాయి కూడా.. తాజాగా 112 ఏళ్ల మహిళ గురించి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. ఎందుకంటే వందేళ్లు దాటిన మనిషి తన చివరి దశలో తన కుటుంబ సభ్యుల మధ్య సంతోషంగా తుదిశ్వాస విడనాడాలని కోరుకుంటూ దైవ నామ స్మరణతో గడిపేస్తారు. అయితే ఈ శతాధిక వృద్ధురాలు  తన చివరి దశలో.. మళ్ళీ పెళ్లి చేసుకోవాలని కోరుకుంటూ.. ప్రేమకు వయస్సు లేదని నిరూపించింది. అంతేకాదు ఎవరైనా యువకుడు తన ముందుకు వచ్చి ప్రపోజ్ చేస్తేనే పెళ్లి చేసుకుంటానని వృద్ధురాలు కండిషన్ కూడా పెట్టింది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఇప్పుడు ఎవరైనా యువకుడు ముందుకు వచ్చి ఈ బామ్మని పెళ్ళాడతా అని చెబితే.. జ‌రిగితే ఈ మ‌హిళ‌కిది ఎనిమిదో పెళ్లి అవుతుంది.

కాస్మో నివేదిక ప్రకారం సితి హవా హుస్సిన్ అనే ఈ వృద్ధురాలు మలేషియాలోని కెలాంతన్‌లోని తుంపట్ నగరంలో నివాసి. 112 ఏళ్ల ఈ బామ్మ ఇప్పటికే ఏడుసార్లు వివాహం చేసుకుంది. ఇప్పుడు ఈ వృద్ధురాలు మళ్లీ పెళ్లి చేసుకోవాలనే కోరికను వ్యక్తం చేసింది.

చిన్న కొడుకు వయసు 58 ఏళ్లు

సితి హవా హుస్సిన్ కు పిల్లలు, మనవళ్లు, ముని మనవలు కూడా ఉన్నారు. నివేదిక ప్రకారం, ఈ వృద్ధ మహిళకు ల్లలు.. 19 మంది మనవళ్లు, 30 మంది ముని మనవళ్లు ఉన్నారు. అదే సమయంలో, చిన్న కుమారుడు అలీ వయస్సు 58 సంవత్సరాలు.

ఇవి కూడా చదవండి

ఎనిమిదో పెళ్లికి కండిషన్స్ అప్లై

వృద్ధురాలు తన మాజీ భర్తల్లో కొందరు చనిపోయారని, మరికొందరితో సంబంధాలు దెబ్బ తిని విడాకులు తీసుకున్నామని చెబుతుంది. సితి హవా హుస్సిన్ తనకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఉందనే కోరికను వ్యక్తం చేస్తూ.. అందుకు ఒక షరతు కూడా పెట్టింది. తనకు ఎవరైనా ప్రపోజ్ చేస్తేనే పెళ్లి చేసుకుంటానని చెప్పింది.

సుదీర్ఘ జీవిత రహస్యం ఏమిటంటే

హవా హుస్సేన్ తన సుదీర్ఘ జీవిత రహస్యాన్ని ప్రజలతో పంచుకుంది. సాధారణ ఆహారాన్ని మాత్రమే ఇష్టపడతానని.. మంచి ఆహారపు అలవాట్లతో పాటు, ఆమె దీర్ఘాయువు కోసం ప్రార్థనను కూడా భావిస్తుంది. రోజుకు ఐదుసార్లు నమాజ్ చేస్తుంది. అంతేకాదు దీర్ఘాయువుకు రహస్యమేమీ లేదని అన్నం తినే సమయంలో నీరు తాగకుండా ఉండటం తనకు అలవాటు అని శతాధిక వృద్ధురాలు పేర్కొంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..