
ఫజిల్ చిత్రాలు, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అలాంటి వాటిని సాల్వ్ చేసేందుకు జనాలు బలే ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ ఇవి చూడ్డానికి మామూలుగానే అనిపించినా.. వాటిని సాల్వ్ చేయడం చాలా కష్టం, ఎంతో నైపుణ్యం, తెలివితేటలు ఉంటే కాని వాటిని మన సాల్వ్ చేయలేం. ఇక అవి గణిత ప్రశ్నలైతే, కాళ్లుపైకి తల కిందకు చేసినా కొన్ని సార్లు వాటిని క్లియర్ చేయలేం. కానీ వాటిలోని మెలికలు తెలిసిన వారు మాత్రం.. వాటని అవలీలగా సాల్వ్ చేస్తారు. మీరు కూడా ఆ మెలుకువలు నేర్చుకుంటే అలాంటి ఫజిల్స్‌ను ఈజీగా సాల్వ్ చేయవచ్చు. కాబట్టి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక గణిత ప్రశ్నను మీరు సాల్వ్ చేసి.. మీ తెలివి తేటలకు పదును పెట్టండి.
వైరల్ ప్రశ్న ఏంటంటే?
మీరూ గణిత ప్రశ్నను సాల్వ్ చేసి మీ తెలివితేటలను పెంచుకోవాలనుకుంటే.. ఈ ప్రశ్న మీ కోసమే.. 2+3 = 10, 8+4 = 96, 7+2 = 63, 6+5 = 66 అయినప్పడు 9+5 = ? అవుతుంది. ఇది ఒక గమ్మత్తైన గణిత ప్రశ్న. చూడ్డానికి ఈ ప్రశ్న సరళంగా అనిపించినప్పటికీ.. నిజానికి కష్టం. ఇక్కడ మీకు టాస్క్ ఏమిటంటే.. మీరు ఈ గణిత పజిల్‌ను 5 సెకన్లలో పరిష్కరించాల్సి ఉంటుంది.
ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనడం సాధ్యమేనా?
మీరు నిర్ణత సమయంలో ఈ ఫజిల్‌ను పరిష్కరించారా? అయితే మీకు ధన్యవాదాలు. మీరు ఎంతో తెలివైన వారని మేము అర్థం చేసుకోగలం. ఒక వేళ మీరు ఈ ఫజిల్‌ను సాల్వ్ చేయలేకపోయినా ఏం పర్లేదు. దీని సమాధాన్ని మేం ఇక్కడ చెప్పబోతున్నాం. చాలా మంది ఈ పజిల్‌ను పరిష్కరించడం కష్టంగా భావిస్తారు. కానీ ఇది చాలా సింపుల్.. ఫస్ట్ దీని సమాధానం వచ్చేసి 126. ఎలా అంటే 2+2=10 అంటే ( 2×2+3×2=10 అని అర్థం) , 8+4=96 ( 8×8+4×8=96 అని అర్థం) అలాగే 9+5= ( 9×9+5×9=126 అవుతుంది) = 126. మీరు కనుగొన్న సమాధానం మేము ఇచ్చిన రెండు సమాధానాలకు ఒకేలా ఉందో లేదో తనిఖీ చేయండి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.