Mountain House: బుర్రకో బుద్ది.. జిహ్వకో రుచు అని ఊరికే అనలేదు. ఒక్కొక్కరి ఆలోచనలో ఒక్కోలా ఉంటే.. ఒక్కొక్కరి నాలుకకి ఒక్కో రుచి బాగా నచ్చుతుంది. అలాగే చూసే విధానంలోనూ అంతే తేడాలుంటాయి. ఇక కొందరు అయితే.. తాము ధరించే దుస్తులు, చెప్పుడు, ఆభరణాలు మొదలు.. తాము నివసించే ఇల్లు, గది, ప్రయాణించే వాహనాలు అన్నీ ప్రత్యేకంగా ఉండాలని భావిస్తారు. ముఖ్యంగా ధనవంతులు తమకు నచ్చిన స్టైల్‌లో డిజైన్ చేయించుకుంటారు. అందుకోసం ఎంత ఖర్చు అయినా వెనుకాడరు. ఓ వ్యక్తి కూడా అలాగే ఆలోచించాడు. ప్రపంచమే నివ్వెర పోయేలాంటి ఇంటిని నిర్మించుకున్నాడు. అది ఇప్పుడు చాలా స్పెషల్ హౌస్‌గా మారింది.
ఆస్ట్రేలియాకు చెందిన ఓ పారిశ్రామికవేత్త విభిన్నమైన అభిరుచి గలవాడు. తాను ఏం చేసినా స్పెషల్‌గా ఉండాలనుకుంటాడు. అందులో భాగంగానే.. తన నివాస గృహం కూడా చాలా స్పెషల్‌గా ఉండాలని భావించి.. అందుకోసం ప్రణాళికలు రచ్చించాడు. ఏమాత్రం ఆలోస్యం చేయకుండా మాంచి ప్లేస్ వెతకడం ప్రారంభించాడు. అయితే, అతను సెలక్ట్ చేసి ప్రాంతం ఏంటో తెలిసాక.. సామాన్యుల మైండ్ బ్లాంక్ అయ్యింది. ఎందుకంటే.. ఎవరూ ఊహించని ప్లేస్‌లో ఇంటి నిర్మాణం చేయాలని ఫిక్స్ అయ్యాడు. సాధారణంగా సముద్రం ఒడ్డున ఇల్లు ఉండాలని, సన్ రైస్‌ను చూడాలని అందరూ ఇష్టపడుతారు. ఇతను కూడా అలాగే భావించాడు. అయితే, ఇంకాస్త భిన్నంగా ఉండాలని భావించాడు. ఇంకేముంది.. సముద్రం ఒడ్డున ఉన్న ఓ భారీ కొండ అంచున ఇల్లు నిర్మించుకోవాలని డిసైడ్ అయ్యాడు.
అది ఎలాంటి ప్లేస్ అంటే.. కింద సముద్రం ఉంటుంది.. పైన ఆకాశం ఉంటుంది. ఇల్లు మాత్రం కొండ అంచున సముద్రంలో వేలాడుతున్నట్లుగా ఉండాలి. ఇదీ అతని ప్లాన్. ఇంకేముంది.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. ఆ ప్లేస్‌లో ఇల్లు కట్టేందుకు ఓ ఆర్టిటెక్ సంస్థను కలిశారు. ఆస్ట్రేలియా ఆర్కిటెక్చర్ సంస్థ మోడ్‌స్కేప్ సంస్థ అతను కోరిన విధంగా ఇంటి నిర్మాణం చేపట్టేందుకు సై అంది. అత్యాధునిక టెక్నాలజీలో ఈ ఇల్లు నిర్మాణం పూర్తి చేశారు. పూర్తిగా గాలిలో తేలియాడుతున్నట్లుగా ఉన్న ఈ ఇంట్లో 5 ఫోర్లు ఉన్నాయి. పై ఫ్లోర్ మొత్తం కూడా కారు పార్కింగ్ కోసం సెట్ చేశారు. మిగిలిన నాలుగు ఫ్లోర్లలో బెడ్ రూమ్, వాష్ రూమ్, కిచెన్ ఉన్నాయి. ఈ ఇంటిని చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. భయానకంగా ఉన్న.. చాలా అద్భుతంగా ఉందంటున్నారు.