Video: గుర్రంపై ఫుడ్‌ డెలవరీ..! ఈ డెలవరీ బాయ్‌ చాలా చాలా స్పెషల్‌.. ఇంతకీ ఇది ఎక్కడంటే..?

చైనాలో గుర్రంపై ఫుడ్ డెలివరీ చేసే డెలివరీ బాయ్ వీడియో వైరల్ అయ్యింది. విశాలమైన గడ్డి మైదానంలో పర్యాటకులకు ఆహారం అందించడానికి, బైక్ లేదా సైకిల్ వెళ్లలేని చోట, అతను ఈ వినూత్న పద్ధతిని ఎంచుకున్నాడు. ఈ ప్రత్యేక సేవ సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంది, ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీలో అరుదైన పోకడలను చూపిస్తుంది.

Video: గుర్రంపై ఫుడ్‌ డెలవరీ..! ఈ డెలవరీ బాయ్‌ చాలా చాలా స్పెషల్‌.. ఇంతకీ ఇది ఎక్కడంటే..?
Horse Food Delivery

Updated on: Oct 10, 2025 | 7:56 PM

ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్ చేసే వారి సంఖ్య పెరిగింది. సాధారణంగా డెలివరీ బాయ్‌లు పార్శిల్‌లను డెలివరీ చేయడానికి బైక్‌లు లేదా సైకిళ్లను ఉపయోగించడం మీరు చూసి ఉంటారు. కానీ ఒక డెలివరీ బాయ్ గుర్రంపై ఫుడ్‌ను డెలివరీ చేస్తున్నాడు. ఈ స్పెషల్‌ ఫుడ్‌ డెలవరీ చైనాలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పర్యాటకులు విశాలమైన గడ్డి ప్రాంతంలో ఉండటం వల్ల డెలివరీ బాయ్ ఈ విధంగా ఆహారాన్ని డెలివరీ చేయడానికి ప్రయత్నించాడు. విశాలమైన గడ్డి మైదానంలో ట్రిప్‌ను ఆస్వాదిస్తున్న పర్యాటకులు ఫుడ్‌ ఆర్డర్ చేశారు. కానీ ఫుడ్ డెలివరీ సిబ్బంది బైక్ లేదా సైకిల్‌పై ఆ ప్రదేశానికి వెళ్లలేరు. దీంతో ఆర్డర్‌ను బైక్‌పై బదులుగా గుర్రంపై వెళ్లి డెలివరీ చేశారు.

cgtn అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయబడిన ఈ వీడియోలో ఒక ఫుడ్ డెలివరీ బాయ్‌ గడ్డి భూముల గుండా గుర్రపు స్వారీ చేస్తూ ఆహారాన్ని ఆర్డర్ చేసిన పర్యాటకులకు ఆహారాన్ని అందిస్తున్నట్లు చూడవచ్చు. అతను తన చేతిలో ఉన్న ఆహారాన్ని కార్లలో ప్రయాణించే పర్యాటకులకు కూడా ఇచ్చాడు.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి