Watch: వార్నీ ఇదేం విధేయతరా సామీ..! బాస్‌కు సాష్టంగా నమస్కరిస్తున్న ఉద్యోగులు.. వీడియో వైరల్‌

|

Dec 19, 2024 | 12:00 PM

2019లో కూడా టార్గెట్‌ రీచ్‌ కాలేదనే కోపంతో ఓ కంపెనీ తన ఉద్యోగులను నడి రోడ్డుమీద మోకాళ్లపై నడవమని శిక్షించిన వీడియో వైరల్‌గా మారిందని పలువురు గుర్తు చేస్తున్నారు.. ఇక ఇప్పుడు తాజాగా విడుదలైన ఈ వీడియో చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. సోషల్ మీడియా వినియోగదారులు వైరల్ వీడియోపై స్పందించకుండా ఆపుకోలేకపోతున్నారు.

Watch: వార్నీ ఇదేం విధేయతరా సామీ..! బాస్‌కు సాష్టంగా నమస్కరిస్తున్న ఉద్యోగులు.. వీడియో వైరల్‌
Toxic Work Culture
Follow us on

సోషల్ మీడియాలో నిత్యం రకరకాల వింత వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. ఎప్పుడు, ఎలాంటి వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతుందో చెప్పడం కష్టం. అలాంటి ఒక విచిత్రమైన వీడియో ఇప్పుడు చర్చనీయాంశంగా కొనసాగుతోంది. ఇది ఓ ఆఫీస్ కారిడార్‌లో బాస్ ముందు ఉద్యోగులంతా సాష్టంగా నమస్కారం చేస్తూ కనిపించారు. ఆడ,మగ తేడాలేకుండా అందరూ ఫ్లోర్‌పై బోర్లగా పడుకుని తమ బాస్ ముందు విపరీతమైన బానిసత్వాన్ని ప్రదర్శించటం సోషల్ మీడియాలో వేదికగా తీవ్ర సంచలనం సృష్టించింది. వీడియో చూసిన సోషల్ మీడియా యూజర్లు కామెంట్‌ చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇక వీడియో చూసిన నెటిజన్లు చాలా మంది తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేశారు. ఎంప్లాయిస్‌ అంతా తమ యజమాని ముందు పడుకుని ఉండటం చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. వీళ్లంతా తమ యజమాని కోసం ప్రాణాలను కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారంటూ వ్యాఖ్యనించారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం, కంపెనీ లీగల్ టీమ్ అటువంటి విషయంలో బాస్ ప్రమేయాన్ని స్పష్టంగా ఖండించింది. అదే సమయంలో, వీడియో ప్రామాణికతను కూడా ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి

సమాచారం మేరకు..క్విమింగ్ బ్రాంచ్ బాస్ హువాంగ్‌కు సదరు కంపెనీ ఉద్యోగులు స్వాగతం పలుకుతున్నారు. ఇందుకోసం వారంతా ఆఫీసు కారిడార్‌లో బాస్‌ ముందు పడుకుని తమ విధేయతను చాటుకుంటున్నారు.. మనం బతికినా, చనిపోయినా.. మన పనిని ఎప్పటికీ విఫలం కానివ్వం అంటున్నారు…. ఇప్పుడు ఈ షాకింగ్ వీడియో సర్వత్రా విమర్శలకు గురవుతోంది.
అయితే, ఈ వార్తను సదరు కంపెనీ ఖండించినప్పటికీ, ఇలాంటి విషపూరిత పని సంస్కృతికి సంబంధించి చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో తీవ్ర దుమారం మొదలైంది.

వీడియో ఇక్కడ చూడండి..

ఇకపోతే, చైనా నుండి ఇలాంటి వార్తలు, వీడియోలు, ఫోటోలు గతంలోనూ అనేకం వెలుగులోకి వచ్చాయని అంటున్నారు. 2019లో కూడా టార్గెట్‌ రీచ్‌ కాలేదనే కోపంతో ఓ కంపెనీ తన ఉద్యోగులను నడి రోడ్డుమీద మోకాళ్లపై నడవమని శిక్షించిన వీడియో వైరల్‌గా మారిందని పలువురు గుర్తు చేస్తున్నారు.. ఇక ఇప్పుడు తాజాగా విడుదలైన ఈ వీడియో చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. సోషల్ మీడియా వినియోగదారులు వైరల్ వీడియోపై స్పందించకుండా ఆపుకోలేకపోతున్నారు. చైనాలోని గ్వాంగ్‌జౌ నగరానికి సంబంధించిన వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి