Video Viral: ఎవరు భయ్యా నువ్వు.. ఏకంగా ట్రాఫిక్ సీఐకు చుక్కలు చూపించిన కామన్ మ్యాన్..

|

Mar 01, 2025 | 7:11 PM

విజయవాడలో పోలీసులకే కౌంటర్ ఇచ్చాడు ఓ ద్విచక్ర వాహనదరుడు. నన్నే లైసెన్స్ అడుగుతారా అంటూ రెచ్చిపోయాడు.. అయితే, మీరు మీ ఐడి కార్డు చూపించండి అంటూ ట్రాఫిక్‌ పోలీసులనే ఎదురు ప్రశ్నించాడు. వాహనాల రెగ్యులర్ చెకింగ్ లో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సీఐ రామారావు ఓ ద్విచక్ర వాహనధారుడిని లైసెన్స్ చూపించాలని అడిగినప్పుడు..ఎదురు సమాధానంగా అతడు.. మీరు పోలిసులా కాదా నకిలీ పోలిసులు అయ్యి అంటారు మీ ఐడి కార్డు చూపించండి.. అంటూ వాగ్వాదానికి దిగాడు..

Video Viral: ఎవరు భయ్యా నువ్వు..  ఏకంగా ట్రాఫిక్ సీఐకు చుక్కలు చూపించిన కామన్ మ్యాన్..
Vijayawada Police ID Challenge
Follow us on

విజయవాడలో పోలీసులకే కౌంటర్ ఇచ్చాడు ఓ ద్విచక్ర వాహనదరుడు. నన్నే లైసెన్స్ అడుగుతారా అంటూ రెచ్చిపోయాడు.. అయితే, మీరు మీ ఐడి కార్డు చూపించండి అంటూ ట్రాఫిక్‌ పోలీసులనే ఎదురు ప్రశ్నించాడు. వాహనాల రెగ్యులర్ చెకింగ్ లో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సీఐ రామారావు ఓ ద్విచక్ర వాహనధారుడిని లైసెన్స్ చూపించాలని అడిగినప్పుడు..ఎదురు సమాధానంగా అతడు.. మీరు పోలిసులా కాదా నకిలీ పోలిసులు అయ్యి అంటారు మీ ఐడి కార్డు చూపించండి.. అంటూ వాగ్వాదానికి దిగాడు.. దీంతో చేసేది లేక సీఐ రామారావు తన ఐడి కార్డు చూపించాల్సి వచ్చింది..

అయితే సదరు వాహనదారుడికి రూల్స్ అతిక్రమించినందుకు గానూ.. చివరికి ఫైన్‌ విధించారు పోలీసులు. ప్రస్తుతం సీఐ రామారావు, బైకిస్ట్ ల మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది. వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు భిన్నమైన రీతిలో స్పందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..