Viral Video: కుక్కల భయంతో ఇంటి మీదికి ఎక్కిన ఆవు.. ఆ తర్వాత… కిందికి దింపేందుకు తలపానం తొకకొచ్చినట్లుందిగా..

ఆదిలాబాద్ జిల్లా బోరజ్ మండలం నిరాల గ్రామంలో ఎవరూ ఊహించని సంఘటన జరిగింది. ఊర కుక్కలు తరమడంతో ఆవు పరుగు పరుగున వెళ్లి ఇల్లు ఎక్కి తనను తాను రక్షించుకుంది. ఆవును కిందికి దింపేందుకు స్థానికులు నానా తంటాలు పడ్డారు. ఆవు బరువుకు పైకప్పు కూలిపోతుందేమోనని...

Viral Video: కుక్కల భయంతో ఇంటి మీదికి ఎక్కిన ఆవు.. ఆ తర్వాత... కిందికి దింపేందుకు తలపానం తొకకొచ్చినట్లుందిగా..
Cow Climbs House

Updated on: Sep 15, 2025 | 6:33 PM

ఆదిలాబాద్ జిల్లా బోరజ్ మండలం నిరాల గ్రామంలో ఎవరూ ఊహించని సంఘటన జరిగింది. ఊర కుక్కలు తరమడంతో ఆవు పరుగు పరుగున వెళ్లి ఇల్లు ఎక్కి తనను తాను రక్షించుకుంది. ఆవును కిందికి దింపేందుకు స్థానికులు నానా తంటాలు పడ్డారు. ఆవు బరువుకు పైకప్పు కూలిపోతుందేమోనని ఆందోళన చెందారు. చాలాసేపు శ్రమించిన అనంతరం ఆవు ఎట్టకేలకు కిందికి దిగింది.

కుక్కలు తరిమితే ఏ జంతువైనా ఎదరిస్తుంది. లేదా దూరం పరిగెత్తి ఎక్కడో చోట కనపడకుండా దాక్కుంటుంది. కానీ ఈ ఆవు మాత్రం విచిత్రంగా ఇల్లు ఎక్కడం స్థానికంగా ఆసక్తిగా మారింది. అయితే అంత పైకి అది ఎలా చేరిందో అన్నది అర్ధం కాలేదు. ఇల్లు ఎక్కిన ఆవు దృశ్యాలను స్థానికులు ఫోన్‌లో రికార్డ్‌ చేయడంతో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

సాధారంగా మేకలు, కుక్కలు, పిల్లులు వంటి జంతువులు కొన్ని సందర్భాల్లో చెట్లు, గుట్టలు ఎక్కడం చూస్తుంటాం. అలాగే కిందకు దిగేందుకు అవి ఇబ్బంది పడుతుంటాయి. అలాంటిది ఒక ఆవు ఏకంగా ఇంటి పైకప్పు పైకి ఎక్కడం ఆశ్చర్యంగా మారింది. మరోవైపు ఆవు ఇంటి పైకి ఎక్కిన ఈ వీడియో క్లిప్‌ను చూసి సోషల్‌ మీడియా జనాలు ఆశ్చర్యపోతున్నారు.

వీడియో చూడండి:

ఆ తర్వాత ఏమైంది? ఆ ఆవు కిందకు దిగిందా? ఎలా దిగింది? ఎవరైనా ఆ ఆవును కిందకు దింపారా? అన్న సందేహాలను కొందరు వ్యక్తం చేశారు. అయితే జంతువుల పట్ల వాటి యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలని కొందరు సూచించారు. లేని పక్షంలో ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయని, అవి ప్రమాదాల బారిన పడతాయని హెచ్చరిస్తున్నారు.