Video: వామ్మో ఇదెక్కడి ఎద్దురా సామి.. వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి.. సైలెంట్‌గా వెనక నుంచి వచ్చి..
రాజస్థాన్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న ఒక వ్యక్తిపై సడెన్‌గా ఒక ఎద్దు దాడి చేసింది. దీంతో తీవ్రంగా గాయపడిన సదురు వ్యక్తి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించాడు. అయితే దాని జోలికి వెళ్లకపోయిన ఎద్దు ఆ వ్యక్తిపై దాడి చేసింది. ఈ దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న ఒక వ్యక్తిపై సడెన్‌గా ఎద్దు దాడి చేయగా హాస్పిటల్ చికిత్స పొందుతూ అతను మరణించిన ఘటన రాజస్థాన్‌లోని బలోత్రా ప్రాంతంలో వెలుగు చూసింది. ఈ దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది జంతువుల పట్ల జనాలు ఎంత జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని తెలియజేస్తుంది. వివరాల్లోకి వెళ్తే.. ఈ ఘటన బలోత్రాలోని బల్దేవ్ జీ కి పోల్ ప్రాంతంలో సెప్టెంబర్ 14 ఆదివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జరిగింది.
స్థానికంగా నివాసం ఉంటున్న మోతీలాల్ అగర్వాల్ అనే వ్యక్తి ఒక స్వీట్ షాపు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. రోజూలాగే అతను ఇంటి నుంచి తన షాప్‌కు బయల్దేరాడు. అతను వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. అయితే ఆ పక్కనే ఒక ఎద్దు ఉండడాన్ని అతని గమనించలేదు. దీంతో ఒక్కసారిగా వెనక నుంచి దూసుకొచ్చిన ఎద్దు అతన్ని కొమ్ములతో ఎత్తి నేలకేసి కొట్టింది. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లి పోయింది. ఈ దాడిలో అగర్వాల్ తీవ్రంగా గాయపడ్డాడు. దీన్ని గమనించిన స్థానికులు వెంటనే బాధితుడిని హాస్పిటల్‌కు తరలించారు. కానీ దురదృష్టవశాత్తు అతను హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అతని కుమారుడు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మరోవైపు ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలో రికార్డడు కావడంతో వాటిని స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. జంతువులతో జనాలు ఎంత జాగ్రత్తగా ఉంటే అంతమంచిదని కొందరు కామెంట్స్ చేశారు. ఆ వ్యక్తి దాని జోలికి వెళ్లక పోయినా.. అది అతనిపై ఎందుకు దాడి చేసిందోనని మరో వ్యక్తి కామెంట్ చేశాడు.
వీడియో చూడండి..
बालोतरा में सांड ने व्यापारी को सींगों से उठाकर पटका, सिर के बल जमीन पर गिरे, अस्पताल में इलाज के दौरान तोड़ा दम, बालोतरा में लगातार आवारा पशुओं का आतंक बढ़ता जा रहा है। #Balotra #बालोतरा @RajCMO pic.twitter.com/WuFSmme00k
— VIJAY KUMAR (@vijaykumarbmr) September 14, 2025
