Humming Bird: రోజు ఇంటికి వచ్చే పక్షికి తేనె పట్టిస్తున్న వ్యక్తి.. నెట్టింట్లో వీడియో వైరల్..

|

Feb 07, 2022 | 4:52 PM

Humming Bird: సోషల్ మీడియా(Social Media) ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత అనేక రకాల వైరల్‌ వీడియోలు చూస్తున్నాం. ఈ వైరల్‌ వీడియో(Viral Video),లలో కొన్ని ప్రకృతిలో జరిగే అద్భుతాలను మన కనుల ముందుకు తీసుకుని వస్తున్నాయి.

Humming Bird: రోజు ఇంటికి వచ్చే పక్షికి తేనె పట్టిస్తున్న వ్యక్తి.. నెట్టింట్లో వీడియో వైరల్..
Humming Bird Video Viral
Follow us on

Humming Bird: సోషల్ మీడియా(Social Media) ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత అనేక రకాల వైరల్‌ వీడియోలు చూస్తున్నాం. ఈ వైరల్‌ వీడియో(Viral Video),లలో కొన్ని ప్రకృతిలో జరిగే అద్భుతాలను మన కనుల ముందుకు తీసుకుని వస్తున్నాయి. ప్రకృతిలో జరిగే ఎన్నో విషయాలు దగ్గరనుంచి చూస్తున్నఅనుభూతినిస్తున్నాయి.. అలాంటి వీడియో ఒకటి తాజాగా నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో ఒక అతి చిన్న పక్షి ఎగురుకుంటూ ఓ ఇంటికి వచ్చి ఆ ఇంటి యజమాని ఇచ్చే తేనె తాగుతుంది. పక్షుల్లో అతి చిన్న పక్షి హమ్మింగ్ బర్డ్. పూలలో తేనె తాగుతూ హాయిగా జీవించే ఈ పక్షికి చాలా ప్రత్యేకతలున్నాయి. ఇది రెక్కలు ఊపుతూ గాలిలో స్థిరంగా ఉండగలదు. అంతేకాదు… వెనక్కి కూడా ఇది ఎగరగలదు. అందువల్లే పూలపై వాలకుండానే తేనె తాగేస్తుంది ఈ బుల్లి పక్షి. ఐతే… మనుషుల్ని చూస్తే రివ్వున పారిపోయే ఈ హమ్మింగ్ బర్డ్ ఓ వ్యక్తికి మాత్రం బాగా దగ్గరైంది. రోజూ అతని ఇంటికి వచ్చి తేనె తాగుతోంది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్ లో ఓ యూజర్‌ ఈ వీడియోని ఫిబ్రవరి 4న పోస్ట్ చేశారు. ఈ హార్ట్‌ టచ్చింగ్‌ వీడియోను వీక్షిస్తున్న లక్షలమంది నెటిజన్లు తెగ లైక్‌ చేస్తున్నారు. ఇందులో ఓ ఇంటి ఫస్ట్ ఫ్లోర్ కి ఉన్న కిటికీ దగ్గర హమ్మింగ్ బర్డ్ ఎగురుతోంది. అంతలో అతను కిటికీ తెరచి… తేనె వున్న హమ్మింగ్ బర్డ్ ఫీడర్ ను తన చేతితో బయట పెడుతున్నాడు. ఆ బాక్సుకి 3 కన్నాలు ఉన్నాయి. ఆ కన్నాలలోకి తన ముక్కుని దింపి తేనె తాగుతోంది హమ్మింగ్ బర్డ్. అతను దాన్ని హెక్టార్ అని పిలుస్తున్నాడు. అది తన ఫ్రెండ్ అట. దీని వెనుక పెద్ద కథే ఉంది. అదేంటంటే..

ఈ వ్యక్తికి అతని కజిన్ హమ్మింగ్ బర్డ్ ఫీడర్ ని తన పుట్టిన రోజు కానుకగా ఇచ్చారట. దాన్ని తీసుకొని అలా పక్కన పెట్టేసి దాని సంగతే మర్చిపోయాడు అతను. తర్వాత కొన్నాళ్లకు అతని కజిన్‌ చనిపోయారట. అలా చనిపోయిన వారు హమ్మింగ్ బర్డ్ రూపంలో వస్తారని ఎవరో చెప్పారట. దాంతో… తనకు పుట్టిన రోజున ఇచ్చిన ఫీడర్ లో తేనె నింపి కింటికీ బయట ఉంచాడట. ఆ ఫీడర్ పై పువ్వు ఆకారం ఉండటంతో… ఓ రోజు నిజంగానే హమ్మింగ్ బర్డ్ వచ్చి చక్కగా తేనె తాగిందట. అంతే అప్పటి నుంచి రోజూ అలా పెడుతుండటంతో.. క్రమంగా ఆ పక్షి ఆ ఫీడర్ కి అలవాటుపడింది. ఆ తర్వాత అతను స్వయంగా ఆ ఫీడర్ ని తన చేత్తో పట్టుకొని పక్షికి అందిస్తుంటే… తేనె తాగుతూ అతనికి దగ్గరైందట. అలా వాళ్ల మధ్య మంచి ఫ్రెండ్షిప్ బాండ్ ఏర్పడిందట.ఇప్పుడా పక్షిలో అతను తన కజిన్ ని చూసుకుంటున్నాడు. నెటిజన్లు ఈ బాండింగ్ పై ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందుకే పై వీడియో వైరల్ అవుతోంది.

 

Also Read:

: భూమివైపు దూసుకొస్తోన్న పెను ప్రమాదం.. నాసా తీవ్ర హెచ్చరిక.. ఎప్పుడంటే?