చాలా సందర్భాల్లో మనం నిద్రపోతున్నప్పుడు కీటకాలు మన ముక్కు, చెవుల్లోకి దూరిపోతుంటాయి. ఇలాంటి ఉదంతాలు అనేకం వెలుగులోకి వచ్చాయి. అలాంటిదే ఒక షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. అందులో నిద్రిస్తున్న మహిళ చెవిలోకి ఏకంగా పాము ప్రవేశించింది. మహిళ పరిస్థితి విషమించటంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఎంత శ్రమించిన డాక్టర్లు ఎట్టకేలకు మహిళ చెవిలో నుంచి పామును బయటకు శారు. అయితే ఆ వీడియో ఎక్కడిది అనే దానిపై ఎలాంటి సమాచారం లేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన సోషల్ మీడియా యూజర్లు రకరకాల సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
వైరల్ వీడియోలో డాక్టర్లు మహిళ చెవిలో దూరిన పామును బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ, పాము బయటకు రావడం లేదు. డాక్టర్ కూడా చెవిలో మందు వేస్తూ కనిపిస్తాడు. పాము నోరు తెరిచి చూసింది కానీ లాగినా బయటకు రావడం లేదు. వీడియోపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి, అయితే ఈ వీడియో చాలా భయానకంగా ఉంది. కానీ, వీడియోపై చాలా మంది నెటిజన్లు అనేక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
A small snake crawled into the ear at night 😳 pic.twitter.com/34c8pOd7zP
— Insane Reality Leaks (@InsaneRealitys) April 6, 2024
పాము చెవిలో దూరితే..దాని తోక బయటకు ఉంటుంది. కానీ, ఇక్కడ పాము నోరు బయట ఉందేంటని సోషల్ మీడియా వినియోగదారు రాశారు. పాము చెవిలో ప్రవేశించి తిరగబడి బయటకు రాగలదా అని మరొకరు రాశారు. ఈ వీడియో ఫేక్ అంటూ చాలా మంది అంటున్నారు. ఈ వీడియో చాలా భయానకంగా ఉందని, ఇది చూసిన తర్వాత నాకు నిద్ర కూడా పట్టడం లేదని మరొకరు రాశారు. మరొకరు వీడియోపై స్పందిస్తూ.. ఈ వీడియో మనకు నిద్రలేని రాత్రులను మిగిల్చిందని, దాని గురించి ఆలోచిస్తే నాకు భయంగా ఉందంటూ వ్యాఖ్యనించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..