Lightning Strikes Viral Video: దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు నగరాలు జలమయంగా మారాయి. ఈ క్రమంలో మహారాష్ట్ర రాజధాని ముంబై మహా నగరంలో గురువారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. బుధవారం నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 24 గంటల వ్యవధిలో 30.96 మి.మీ వర్షపాతం నమోదైంది. దీంతో జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. రహదారులన్నీ జలమయమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ముంబై నగరంలో పిడుగు పడుతున్న దృశ్యం నెట్టింట వైరల్ అయింది. ఓ భవనంపై పిడుగు పడుతుండగా.. ఒకరు సెల్‌ఫోన్‌లో రికార్డు చేశారు. అనంతరం ఈ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు భయానకంగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.
వైరల్ అయిన వీడియో.. ముంబైలోని బోరివలి వెస్ట్ ప్రాంతానికి చెందినది. దీనిలో పిడుగు పడుతుండటాన్ని చూడవచ్చు. ఇది బోల్ట్ నేమినాథ్ బిల్డింగ్‌ను నేరుగా తాకింది. అయితే.. పిడుగుపాటు వల్ల ఎలాంటి నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ సన్నివేశం భయానకంగా ఉందని.. అదృష్టవశాత్తూ ఎలాంటి నష్టం జరగలేదని ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన యూజర్ పేర్కొన్నాడు. ఎనిమిది సెకన్ల వీడియోలో పెద్ద శబ్దంతో భవనంపై పిడుగు పడుతుండటాన్ని చూడవచ్చు. ఈ సమయంలో ఆ ప్రాంతంలోని మరో భవనం నుంచి వీడియో తీశారు.
వైరల్ వీడియో..
Borivali, Mumbai yesterday ⚡️
It surely was scary! Luckily they had installed a lightning rod in the bldg so If the lightning strikes it directly goes to the ground! #Mumbai #Borivali pic.twitter.com/KR94GedXwt— ?????? ????? ?? (@IshitaJoshi) September 8, 2022
కెమెరా పట్టుకున్న వ్యక్తి పిడుగు పడే సమయంలో వణుకుతూ కనిపించాడు. కాగా.. ముంబై నగరంలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..