సోషల్ మీడియా(Social Media) పిచ్చి.. ఎంతగా ఎక్కిందంటే ఫేస్ బుక్, ఇన్ స్టాలో లైకులు, కామెంట్ల కోసం ఏదైనా చేసేస్తున్నారు. ముఖ్యంగా యువత సోషల్ మీడియా మోజులో పడిపుతున్నారు. ఎలాగైనా ఫేమస్ కావాలనే ఉద్దేశంతో వికృత చేష్ఠలకు పాల్పడుతున్నారు. తద్వారా వీరు ప్రమాదాల బారిన పడటమే కాకుండా.. పక్కవారినీ ప్రమాదంలో నెట్టేస్తున్నారు. రోడ్డుపై వేగంగా డ్రైవ్ చేయడం, డ్రైవింగ్ చేస్తూ విన్యాసాలు చేయడం, రోడ్డుపై సెల్పీలు తీసుకోవడం వంటి చర్యలు చికాకు తెప్పిస్తున్నాయి. ఇలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు రద్దీగా ఉన్న రోడ్డుపై భయంకరమైన రీతిలో స్టంట్స్ చేస్తూ.. తోటి వాహనదారులకు భయం కలిగించాడు. దీనిని అంతా వీడియో తీసిన ఓ వ్యక్తి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలోని ఆగ్రాలో (Agra) ఓ రోడ్డుపై వాహనాల రద్దీ అధికంగా ఉంది. ఆ సమయంలోనే ఓ యవుకుడు బైక్ పై రయ్యుమంకటూ వేగంగా దూసుకొచ్చాడు. హైస్పీడ్ గా వెళ్తూ బైక్ తో విచిత్ర స్టంట్స్ చేశాడు. బైకు సీటు నుంచి దిగి ఫుట్ స్టాండ్‌పై నిలబడి డ్రైవ్ చేశాడు. మళ్లీ బైకుపై కూర్చుని అటూ ఇటూ వంకర్లు తిప్పుతూ బైకు నడపాడు. ఈ సంఘటనను చూసిన మిగతా వాహనదారులు షాక్ అయ్యారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వాహనదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
शहर की लाइफ लाइन एमजी रोड पर युवा द्वारा किए गए खतरनाक स्टंट
एमजी रोड पर हो सकता था बड़ा हादसा किसी और को भी डाल सकता था परेशानी में
खतरनाक स्टंट करने वाले लड़के की बाइक का नंबर UP80FM0095 किया गया नोट@dgpup @adgzoneagra@igrangeagra @Uppolice @uptrafficpolice pic.twitter.com/GuSsr4Jk0s— Madan Mohan Soni (@madansonietvup) June 29, 2022
ఇలాంటి యువకుల నిర్లక్ష్యం కారణంగా పక్క వారు కూడా ప్రమాదంలో పడతారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదుతో అప్రమత్తమైన ఎస్పీ సిటీ వికాస్‌కుమార్.. యువకుడిపై చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు యువకుడిపై మండిపడుతున్నారు. అతనికి వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి