Viral Video: దొంగ పిల్లి భలే మస్కా కొట్టిందిగా… చిలుక కొట్టిన దెబ్బకి గట్టి షాకే తగిలింది..

|

Jul 09, 2022 | 10:14 AM

Viral Video: జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలు ఇటీవల నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా పెంపుడు జంతువులకు సంబంధించిన వీడియోలు ఆకట్టుకుంటున్నాయి...

Viral Video: దొంగ పిల్లి భలే మస్కా కొట్టిందిగా... చిలుక కొట్టిన దెబ్బకి గట్టి షాకే తగిలింది..
Follow us on

Viral Video: జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలు ఇటీవల నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా పెంపుడు జంతువులకు సంబంధించిన వీడియోలు ఆకట్టుకుంటున్నాయి. చేతిలో స్మార్ట్‌ఫోన్‌లు, ఫోన్‌లో ఇంటర్‌నెట్‌ అందుబాటులో ఉండడంతో.. కాస్త భిన్నంగా కనిపించే ఏ చిన్న అంశాన్నైనా వెంటనే కెమెరాలో బంధించి, సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. ఇలా ప్రతి రోజూ నెట్టింట ఎన్నో వీడియోలు హల్చల్‌ చేస్తున్నాయి. తాజాగా అలాంటి ఓ వీడియోనే నెటిజన్లు ఫిదా చేస్తోంది.

ఇంతకీ విషయమేంటంటే.. ఓ చిలుక బెడ్‌పైన వాలింది. అదే సమయంలో పిల్లి అక్కడికి వచ్చింది. నక్కి, నక్కి వచ్చి చిలుకను పట్టుకోవాలని ప్రయత్నించింది. అయితే పిల్లి అలజడి వినిపించిందో ఏమో కానీ.. చిలుక వెంటనే వెనక్కి టర్నింగ్ ఇచ్చుకుంది. దీంతో ఒక్కసారిగా అలర్ట్‌ అయిన పిల్లి పక్కకు తప్పుకుంది. తనలోని యాక్టింగ్‌ స్కిల్‌ను ప్రదర్శిస్తూ గోడను పట్టుకొని అటువైపు చూస్తున్నట్లు నటించింది.

దీనంతటినీ అక్కడే ఉన్న యజమాని వీడియో తీయడంతో ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. ‘ఏం లేదు.. గోడను చూస్తున్నాను’ అనే పర్‌ఫెక్ట్‌ క్యాప్షన్‌తో పోస్ట్‌ చేసిన ఈ వీడియో ట్విట్టర్‌లో వైరల్‌ అవుతోంది. పిల్లి నటన చూసిన వారు ఇది నిజంగానే దొంగ పిల్లి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..