Lightning Strikes Mahadev Temple: ‘పిడుగు’పాటు అని వినడమే తప్ప చూసినవారు చాలా తక్కువగా.. అరుదుగా ఉంటారు. ఆ శబ్ధం వస్తేనే చాలు భయంతో మనమంతా ఇళ్లల్లోకి పరుగులు తీస్తుంటాం. ఒకవేళ ఇంట్లో ఉన్నా సరే.. పిడుగు పాటు శబ్ధానికి భయంతో వణికిపోతుంటాం. అయితే.. అలాంటి అరుదైన దృశ్యాన్ని ఓ ఔత్సాహికుడు ఎంతో నైపుణ్యంతో కెమెరాలో బంధించాడు. హిమాచల్ ప్రదేశ్ కులు జిల్లాలో గురువారం కారు మబ్బులు కమ్ముకున్న కాసేపటికే మహాదేవ్ కొండపై పిడుగుపడింది. ఈ పిడుగుపాటు సంఘటనను ఔత్సాహికుడు తన కెమెరాలో బంధించి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇంకేముంది ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్‌గా మారింది.
అయితే ఈ లోయలో దశాబ్దంలో నాటినుంచి పిడుగుపాటు సంఘటనలు అధికమయ్యాయని పేర్కొంటున్నారు. అయితే.. ఈ సారి పిడుగు హిమాచల్ కులు లోయలోని అతి పురాతన ఆలయం మహదేవ్ ఆలయ ప్రాంతం కొండపై పడింది. దీంతో అక్కడ కలవరం మొదలైంది. మహాశివుని ఆశీర్వచనాలు ఈ కొండకు ఉన్నాయని పేర్కొంటున్నారు. దీంతోపాటు ఈ శివాలయంను.. బిజ్లి మహాదేవ్ ఆలయం అంటారు. అయితే.. ఈ పిడుగుపాటు వల్ల ఆ ప్రదేశంలోని వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. ప్రస్తుతం ఈ సంఘటన చూసి అందరి కళ్లు చెదిరిపోతున్నాయి. వైరల్‌గా మారిన వీడియోను మీరు కూడా చూడండి..
వీడియో..