Viral Video: ట్రైన్‌లో కిటికీ కర్టెన్ వద్ద ఏదో కదులుతూ కనిపించింది.. చెక్ చేయగా.. వామ్మో..

రైలులో ఒక్కసారిగా పాము ప్రత్యక్షం కావడంతో వృద్ధ దంపతులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే తమ కుమారుడికి సమాచారం అందించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

Viral Video: ట్రైన్‌లో కిటికీ కర్టెన్ వద్ద ఏదో కదులుతూ కనిపించింది.. చెక్ చేయగా.. వామ్మో..
Snake In Train
Follow us

|

Updated on: Oct 26, 2024 | 1:52 PM

రైలులో గోవాకు వెళ్తున్న వృద్ధ దంపతులకు ఊహించని షాక్ తగిలింది. వారు బుక్ చేసుకున్న లోయర్ బెర్త్ కిటికీ కర్టెన్ వెనుక పాము కనిపించడంతో.. కంగుతున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో వారు… జార్ఖండ్‌లోని జసిదిహ్ నుంచి.. గోవాకు సెకండ్ ఏసీ కోచ్‌లో ప్రయాణిస్తున్నారు. వృద్ధ దంపతులు కిటికీ తెర వెనకాల ఏదో  కదులుతున్నట్లు గమనించారు. నిశితంగా పరిశీలించగా విషపూరితమైన పామును గుర్తించారు. వారు వెంటనే ఫోన్ ద్వారా తమ కుమారుడికి సమాచారం అందించారు. సహాయం కోసం IRCTC సిబ్బందిని సంప్రదించారు.

తన తల్లిదండ్రుల కోసం టిక్కెట్లు బుక్ చేసిన ఆ యువకుడు బెర్త్, రైలు వివరాలతో పాటు ఘటన తాలూకా వీడియోను ‘X’లో పంచుకున్నాడు.  “హాయ్ @IRCTCofficial @RailMinIndia.. రైలు నంబర్ -17322 (జసిదిహ్ టూ వాస్కోడి గామా)లో అక్టోబరు 21వ తేదీన AC 2 టైర్‌ బెర్త్‌‌లో విషపూరిత పాము కనిపించింది. రైలులో ప్రయాణించిన నా తల్లిదండ్రుల తరపున ఈ కంప్లైంట్ చేస్తున్నారు. దయచేసి వెంటనే దీనిపై చర్యలు తీసుకోండి. మీకు రిఫరెన్స్ కోసం వీడియోలను జత పరిచాను, ”అని అంకిత్ కుమార్ సిన్హా ఎక్స్‌లో వివరాలు పోస్ట్ చేశారు.

రైల్వే సర్వీస్ బృందం వేగంగా స్పందించడంతో ఈ సమస్య పరిష్కారమైంది. రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకుని విషపూరిత పామును పట్టుకుని రైలు నుంచి బయటకు తీశారు. జార్ఖండ్-గోవా మధ్య నడిచే వాస్కో-డగామా వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

భారతీయ రైల్వే రైళ్లలో పాములు కనిపించడం ఇదే తొలిసారి కాదని చెప్పాలి. అంతకుముందు సెప్టెంబర్‌లో గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ (12187)లో ఐదు అడుగుల పొడవున్న పాము కనిపించడం ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..