
ఈ నెల 17న ప్రధాని నరేంద్ర మోదీ వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించారు. కోల్‌కతా – గౌహటి మధ్య నడిచే రైలును ప్రధాని లాంచ్ చేశారు. భారతీయ రైల్వేలో ఎంతో ప్రత్యేకంగా నిలిచేలా ఈ వందే భారత్ స్లీపర్ రైలును రూపొందించారు. ముఖ్యంగా రాత్రిపూట, సుదూర ప్రయాణాల కోసం దీన్ని తీసుకొచ్చారు. సీటింగ్-ఓన్లీ కోచ్‌లతో చిన్న ప్రయాణాలపై దృష్టి సారించిన మునుపటి వందే భారత్ సేవల మాదిరిగా కాకుండా, ఈ వెర్షన్ ఎయిర్ కండిషన్డ్ స్లీపర్ బెర్త్‌లతో తీసుకొచ్చారు. రాత్రిపూట రైలు ప్రయాణాలను మరింత సౌకర్యవంతంగా చేయాలనే లక్ష్యంలో భాగంగా ఈ రైళ్లలో మరో ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు. అదే రీమూవబుల్ బ్లాంకెట్.
సాధారణంగా రైళ్లలో రాత్రి వేళ సుదూర ప్రాణాలు చేసే వారికి ఇండియన్ రైల్వేస్ బ్లాంకెట్స్ అందజేస్తుంది. కానీ అనేక సందర్భాల్లో అవి మురికిగా ఉంటున్నాయని, వేరే వాళ్లు వాటిన బ్లాంకెట్లను తనకు ఇస్తున్నారని అనేక మంది ప్రయాణికులు ఫిర్యాదు చేసేవారు. ఇప్పుడు ఆ సమస్యను దృష్టిలో పెట్టుకొని వందే భారత్ స్లీపర్‌లో డిఫరెంట్ ఐడియాతో ఇండియన్ రైల్వే ముందుకొచ్చింది. బ్లాంకెట్‌ను ఓ అందమైన క్లాత్ కవర్‌లో వేసుకొని హాయిగా కప్పుకోవచ్చు. ఆ బ్లాంకెట్ కవర్ ప్రతి ప్రయాణికుడికి కొత్తది ఇస్తారు. సో.. వాడిని బ్లాంకెట్ ఇస్తున్నారనే ఫిర్యాదులు ఇకపై రావు. అలాగే ఏదైతే మెయిన్ బ్లాంకెట్ ఉందో అది మురికి అవ్వదు. ఎందుకంటే దానిపై ఈ క్లాత్ కవర్ ఉంటుంది కనుక.
అయితే. వందే భారత్ స్లీపర్‌లో బ్లాంకెట్ ఎలా ఉంది అనే విషయంపై ఓ ప్రయాణికులు మొట్టమొదటి రివ్యూ ఇచ్చాడు. ఇంతకీ అతను దాని గురించి ఏమన్నాడంటే.. హౌరా – కామాఖ్య (గువహతి) మధ్య నడిచే వందే భారత్ స్లీపర్ మార్గంలో ప్రయాణిస్తున్న సుకాంత్ షా అనే వ్యక్తి ఓ రీల్ షేర్ చేశాడు. రైలులో తనకు లభించిన దుప్పటిని చూపిస్తూ, అది సాధారణ దుప్పటి కంటే భిన్నంగా ఉందని అన్నాడు. దీనికి నీలం-ఆకుపచ్చ డిజైన్ ఉంది. ఉపయోగించిన దుప్పట్లు ఇస్తున్నారనే ప్రయాణీకుల ఫిర్యాదుల సమస్యను పరిష్కరించడానికి భారతీయ రైల్వేలు దుప్పటి కవర్లను అందిస్తున్నాయని అతను తెలిపాడు. దుప్పటి కవర్‌పై నార్తర్న్ ఫ్రాంటియర్ రైల్వే (NFR) అధికారిక లోగో కూడా ఉందని అతను చూపించాడు. ఈ దుప్పటి కవర్లు రీమూవ్ చేయవచ్చు, శుభ్రపరచడానికి ఈజీగా ఉంటుంది. ఇవి వందే భారత్ ప్రయాణీకుల కోసం ప్రీమియం లినెన్ కిట్‌లో భాగంగా వస్తాయని తెలిపాడు. ఇందులో కవర్‌తో కూడిన దిండు, బెడ్‌షీట్, హ్యాండ్ టవల్ కూడా ఉంటాయి. మొత్తానికి వందే భారత్ స్లీపర్‌లోని బ్లాంకెట్ సౌకర్యాలు ప్రయాణికులను సంతృప్తి పరిచేలా ఉన్నాయన్న మాట.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి