వరి పొలంలో పని చేస్తున్న రైతును కరిచిన బ్లాక్ కోబ్రా.. కోపంతో ఏం చేశాడో తెలుసా..?
ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో జరిగిన ఒక వింత సంఘటన వైరల్‌గా మారింది. 28 ఏళ్ల వ్యక్తి పాము కాటుకు గురయ్యాడు. అయితే పాము కరిచిందన్న కోపంతో పామును తిరిగి కొరికి చంపాడు. తడియావాన్ పోలీసు పరిధిలోని భదయాల్ గ్రామానికి చెందిన పునీత్ అనే వ్యక్తి తన వరి పొలంలో పనిచేస్తున్నాడు. ఇంతలో అటుగా వచ్చిన 4 అడుగుల పొడవైన నల్ల తాచు అతని కాలుకు చుట్టూ చుట్టుకుని కరిచింది.

ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో జరిగిన ఒక వింత సంఘటన వైరల్‌గా మారింది. 28 ఏళ్ల వ్యక్తి పాము కాటుకు గురయ్యాడు. అయితే పాము కరిచిందన్న కోపంతో పామును తిరిగి కొరికి చంపాడు. అత్యంత ఆశ్చర్యకరమైన రీతిలో ప్రతీకారం తీర్చుకున్నాడు. తడియావాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భదయాల్ గ్రామానికి చెందిన పునీత్ అనే వ్యక్తి తన వరి పొలంలో పనిచేస్తుండగా, 4 అడుగుల పొడవైన నల్ల నాగుపాము అతని కాలు చుట్టూ చుట్టుకుని కరిచింది.
అయితే భయపడటానికి బదులుగా, పునీత్ తన చేతులతో పామును పట్టుకుని, కోపంతో, దాని పడగను తన పళ్ళతో కొరికి, అక్కడికక్కడే చంపాడు. అతని కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని హర్దోయ్ మెడికల్ కాలేజీకి తరలించారు, అక్కడ అతన్ని రాత్రంతా పరిశీలనలో ఉంచారు. తరువాత డిశ్చార్జ్ చేశారు. వైద్యులు అతని కాలు మీద కాటు గుర్తులను నిర్ధారించారు. కానీ నాగుపాము పడగ నమలడం ప్రాణాంతకమని హెచ్చరించారు. ఆ విషం తీసుకుంటే ప్రాణాంతకం కావచ్చు. ఈ వింత చర్య ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు దిగ్భ్రాంతికి గురయ్యారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
