గిన్నిస్ వరల్డ్ రికార్డ్.. ప్రపంచంలోనే అత్యంత అరుదైన, వింత, విశిష్ట, అసాధ్యమైన పనులు చేసిన వారికి ఇందులో స్థానం దక్కుతుంది. అయితే, ఇప్పటి వరకు రకరకాల మనుషులు, వారు చేసిన విభిన్న పనులకు సంబంధించి గిన్నిస్ రిక్డర్ సృష్టించిన ఘటనలు అనేకం వార్తల్లో చూశాం. అయితే, ఇప్పుడు మరో అరుదైన, ఎవరూ ఊహించని విభాగంలో ఓ వ్యక్తి ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు.. అదేంటో తెలిస్తే మీరు ముక్కున వేలేసుకుంటారు.. పూర్తి వివరాల్లోకి వెళితే…
అమెరికాకు చెందిన గ్యారీ క్రిస్టెన్‌సేన్ భారీ గుమ్మడి కాయ పడవతో గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నాడు. కొలంబియా నదిలో 26 గంటల్లో ఏకంగా 73.50 కిలోమీటర్లు ప్రయాణించాడు. నదిలో వాషింగ్టన్‌లోని నార్త్ బొన్నెవిల్లి నుంచి వాంకోవర్ వరకు అతడు గుమ్మడి కాయ పడవలోనే సునాయాసంగా చేరుకున్నాడు. గుమ్మడికాయ బోటులో అత్యంత దూరం ప్రయాణించిన వ్యక్తిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. గుమ్మడికాయ పడవపై అంతకు ముందెవ్వరూ ఇంత దూరం ప్రయాణం చేయకపోవడంతో దానిని గిన్నిస్ రికార్డుగా నమోదు చేశారు.
ఇక్కడ క్లిక్ చేయండి..
స్వతాహాగా భారీ సైజులో గుమ్మడికాయలు పెంచడం గ్యారీకి అలవాటు. 2013లో అలా తయారు చేసిన గుమ్మడికాయ పడవపై ప్రయాణం చేసి స్థానిక పోటీలో బహుమతి గెల్చుకున్నాడు. తాజాగా కొలంబియా నదిలో 26 గంటల్లో ఏకంగా 73.50 కిలోమీటర్లు ప్రయాణించి, గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నాడు. గుమ్మడికాయ బోటులో అత్యంత దూరం ప్రయాణించిన వ్యక్తిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. గత నెల 31న గిన్నిస్ రికార్డ్స్ బృందం ఆయనకు ప్రశంసపత్రాన్ని అందించింది. నది మధ్యలో భారీగా మొక్కలు ఉండటంతో ప్రయాణం చాలా కష్టతరమైందని గ్యారీ చెప్పుకొచ్చాడు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..