Viral News: ఆన్లైన్‌లో జంక్ హెలికాప్టర్‌ను కొనుగోలు.. అందమైన ఇంటిగా మార్చుకున్న పైలెట్ దంపతులు.. ఎక్కడంటే..

|

May 25, 2022 | 1:22 PM

కొంతమంది తాము తరచుగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణించాల్సి ఉంటుంది కనుక సొంతం ఇల్లు వృధా అనే ఫీలింగ్ కూడా ఉంది. అలాంటి సమస్యను ఎదుర్కొంటున్నవారిలో ఒకరు అమెరికాకు చెందిన బ్లాక్ మోరిస్, మ్యాగీ మోర్టన్ దంపతులు.

Viral News: ఆన్లైన్‌లో జంక్ హెలికాప్టర్‌ను కొనుగోలు.. అందమైన ఇంటిగా మార్చుకున్న పైలెట్ దంపతులు.. ఎక్కడంటే..
Us Coast Guard Pilot Couple
Follow us on

Viral News: ప్రపంచంలో ఏ దేశస్థులకైనా సొంత ఇంటిని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. తమ ఆర్ధిక శక్తికి తగిన విధంగా ఇంటిని ఏర్పాటు చేసుకుంటారు. అవును ప్రతి ఒక్కరూ సొంత ఇల్లు కావాలని కల కంటారు. అయితే నేటి కాలంలో ఇల్లు కట్టుకోవడం అంత తేలికైన పని కాదు. తాము జీవితంలో ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు అంతా ఖర్చుపెట్టాల్సి వస్తుంది. సామాన్యులు, పేదవారు అయితే.. ఎంత కష్టపడినా ఎక్కడో చోట రెండు మూడు గదుల ఇల్లు కట్టుకుంటారు. అదే పట్టణంలో లేదా నగరాల్లో ఉండేవారు మాత్రం.. సొంతంగా ఇంటిని ఏర్పాటు చేసుకోవడం అంటే బహుకష్టం. అంతేకాదు కొంతమంది తాము తరచుగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణించాల్సి ఉంటుంది కనుక సొంతం ఇల్లు వృధా అనే ఫీలింగ్ కూడా ఉంది. అలాంటి సమస్యను ఎదుర్కొంటున్నవారిలో ఒకరు అమెరికాకు చెందిన బ్లాక్ మోరిస్, మ్యాగీ మోర్టన్ దంపతులు. అయితే ఈ దంపతులు తమ సమస్యకు సరికొత్త పరిష్కారం కనుగొన్నారు.. ఈ  పైలట్ జంట. ఇటుకలతో ఇల్లు కట్టకుండా .. హెలికాప్టర్‌ను తన ఇంటిగా చేసుకున్నారు.

వాస్తవానికి.. ఈ జంట పాతదని పక్కన పెట్టేసిన ఓ హెలికాప్టర్‌ను ఆన్‌లైన్‌లో చూసి కొనుగోలు చేశారు. తర్వాత కొంత  డబ్బును వెచ్చించి విలాసవంతమైన క్యాంపు హౌస్‌గా మార్చారు. ఏ దంపతులు ఇద్దరూ యుఎస్ కోస్ట్ గార్డ్‌లో పైలట్‌లు పనిచేశారు. తమ అనుభవాన్ని ఉపయోగించి ఆ హెలికాప్టర్‌ను ప్రత్యేకమైన ఇంటిగా మార్చుకున్నారు.

ఇవి కూడా చదవండి

బ్లాక్ మోరిస్, మ్యాగీ మోర్టన్ దంపతులు ఈ పాత హెలికాప్టర్‌ను ఫేస్‌బుక్ మార్కెట్‌ లో చూశామని.. చూసిన వెంటనే తమకు నచ్చేసిందని చెప్పారు. అందుకనే వెంటనే తాము హెలికాప్టర్‌ను బుక్ చేసుకున్నామని చెప్పారు. హెలికాప్టర్‌ తమకు  డెలివరీ అయిన వెంటనే ఆ జంట దానిని తమ అందమైన ఇంటిగా మార్చే పనిని ప్రారంభించారు. ఎందుకూ పనికిరాదు అని పక్కన పడేసిన హెలికాప్టర్‌ను నివాసయోగ్యంగా మార్చారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పోస్ట్‌ను వీక్షించండి

ఇప్పుడు పైలట్ జంట హెలికాప్టర్‌ను విలాసవంతమైన ఇల్లుగా మార్చేసుకున్నారు. బాత్రూమ్ నుండి వంటగది, పడకగది వరకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అంతేకాదు క్యాంపింగ్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు  హెలికాప్టర్‌లోనే ఏర్పాటు చేశారు. అంతేకాదు తమ ట్రావెలింగ్ ఇంటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో తరచుగా షేర్ చేస్తుంటారు.

మోరిస్ తాను కొనుగోలు చేసిన హెలికాప్టర్ గతంలో జర్మన్ పోలీసుల వద్ద ఉందని చెప్పాడు. ఆ తర్వాత ఈ హెలికాఫ్టర్  అమెరికా ఆర్మీ కొనుగోలు చేసి.. ఆఫ్ఘనిస్తాన్‌లో తన సైన్యానికి ఇచ్చింది. అనంతరం ఈ హెలికాఫ్టర్ 2011లో మళ్లీ అమెరికాకు తీసుకుని వచ్చి జంక్‌గా మారింది. ఇప్పుడు ఈ దంపతులు కొనుగోలు చేసి.. అందమైన ఇంటిగా మార్చేశారు.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌   వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..