Watch: కాదేది మద్యం అక్రమ రవాణాకు అనర్హం..! పుస్తకాల చాటున గుట్టుగా దాచారు.. వీడియో చూస్తేనే కిక్కు ఖాయం..!!

|

Aug 10, 2024 | 4:44 PM

రోజూవారిగానే ఒక వ్యక్తి చేతిలో పుస్తకాలతో రిక్షాలో వెళ్తుండగా పోలీసులకు అనుమానం వచ్చింది. ఆపై పోలీసులు అతన్ని తనిఖీ చేయగా పుస్తకాల నుంచి నేరుగా మద్యం సీసాలు బయటపడ్డాయి. అదేలా పుస్తకాల మద్యలో మద్యం సీసాలు ఎలా పెడతారనే సందేహం మీకు ఉంటుంది..? అదేలాగో తెలియాలంటే ఈ వైరల్ వీడియో చూడండి.

Watch: కాదేది మద్యం అక్రమ రవాణాకు అనర్హం..! పుస్తకాల చాటున గుట్టుగా దాచారు.. వీడియో చూస్తేనే కిక్కు ఖాయం..!!
Alcohol Smuggler
Follow us on

మద్యం అక్రమ రవాణా చట్ట ప్రకారం నేరం. పట్టుబడితే కఠిన శిక్ష తప్పదని పోలీస్‌ యంత్రాంగం ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటుంది. అయినప్పటికీ, కొంతమంది త్వరగా డబ్బు సంపాదించాలనే అత్యాశతో ఈ నేర మార్గాన్ని అనుసరిస్తారు. అధికారుల కళ్లుగప్పి మద్యం అక్రమ రవాణాకు పాల్పడుతుంటారు. అలాంటి ఒక లిక్కర్ స్మగ్లర్ పోలీసులకు పట్టుబడ్డాడు. అతడు మద్యం ఎలా దొంగచాటుగా రవాణా చేస్తున్నాడో చూసిన ఖాకీలు కంగుతిన్నారు. విద్యార్థులు చదువుకునే పుస్తకాల మాటున మద్యం సీసాలను దాచి రహస్యంగా తీసుకువెళుతున్నాడు.

రోజూవారిగానే ఒక వ్యక్తి చేతిలో పుస్తకాలతో రిక్షాలో వెళ్తుండగా పోలీసులకు అనుమానం వచ్చింది. ఆపై పోలీసులు అతన్ని తనిఖీ చేయగా పుస్తకాల నుంచి నేరుగా మద్యం సీసాలు బయటపడ్డాయి. అదేలా పుస్తకాల మద్యలో మద్యం సీసాలు ఎలా పెడతారనే సందేహం మీకు ఉంటుంది..? అదేలాగో తెలియాలంటే ఈ వైరల్ వీడియో చూడండి.

ఇవి కూడా చదవండి

ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌ నుంచి బీహార్‌కు మద్యం బాటిళ్లను అక్రమంగా సరఫరా చేస్తున్నాడు ఒక వ్యక్తి. ఇందుకోసం అతడు నేరుగా పుస్తకాలను అడ్డుపెట్టుకున్నాడు. బుక్స్‌అన్ని ఒక సన్నని తాడుతో కట్టేసి ఉంచాడు. పుస్తకాల మధ్యలో ప్రత్యేకించి గడులాంటివి తయారు చేశారు.. ఉదాహరణకు ఒక సెల్‌ఫోన్‌ కొన్నప్పుడు ఎలాగైతే బాక్స్‌లో అమర్చి ఉంటుందో అలాగే.. మద్యం సీసాల కోసం మందపాటి కార్డ్‌బోర్డ్‌ టైప్‌ ఏర్పాటు చేశాడు. ఈ సీసాల పైన మరికొన్ని పుస్తకాలు అమర్చాడు. కాబట్టి, ఎవరికీ అనుమానం రాదు.. అయితే ఈ మద్యం అక్రమ రవాణాపై పోలీసులకు పక్కా సమాచారం అందింది. దాంతో అతని గుట్టు రట్టైంది. పోలీసులు రిక్షా ఆపి పుస్తకాలను కట్టేసిన తాడు విప్పి చూడగా.. బుక్స్‌ మధ్యలో మద్యం దొరికింది. పోలీసులు అవన్నీ స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్‌ను అరెస్టు చేశారు.

పోలీసులు అందించిన సమాచారం మేరకు ఈ కోణంలో తదుపరి విచారణ కొనసాగుతోంది. మద్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. కాగా, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోను 1 కోటి 58 లక్షల మందికి పైగా నెటిజన్లు వీక్షించారు. చాలా మంది దీనిపై అనేక రకాల ఫన్నీ రియాక్షన్‌లు ఇచ్చారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..