Swiggy Delivery: స్విగ్గీ నిర్వాకం.. చిల్లీ పనీర్‌ ఆర్డర్‌ చేస్తే చిల్లీ చికెన్‌ డెలివరీ! ఆ తర్వాత ఏం జరిగిందంటే..

| Edited By: Ravi Kiran

Oct 12, 2023 | 12:13 PM

ఓ రెస్టారెంట్ నిర్వాకం వల్ల కస్టమర్‌ తీవ్రంగా అశ్వస్థతకు గురయ్యాడు. పనీర్‌ చిల్లీ స్విగ్గీలో ఆర్డర్‌ పెడితే స్విగ్గీ డెలివరీ బాయ్ చిల్లీ చికెన్‌ డెలివరీ ఇచ్చాడు. దీంతో దానిని తిన్న శాకాహార వ్యక్తి తీవ్ర ఆశ్వస్థతకు గురయ్యాడు. తనకు నాన్-వెజ్ ఫుడ్ డెలివరీ చేశాడని ఆరోపిస్తూ సదరు స్విగ్గీ డెలివరీ బాయ్‌, ఫుడ్‌ పంపిన రెస్టారెంట్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చిల్లీ పనీర్‌కు బదులు చిల్లీ చికెన్‌ డెలివరీ చేశాడని, అది తినడం వల్ల తాను ఆసుపత్రి పాలయ్యానని ఫిర్యాదులో..

Swiggy Delivery: స్విగ్గీ నిర్వాకం.. చిల్లీ పనీర్‌ ఆర్డర్‌ చేస్తే చిల్లీ చికెన్‌ డెలివరీ! ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Chilli Chicken
Follow us on

లక్నో, అక్టోబర్ 11: ఓ రెస్టారెంట్ నిర్వాకం వల్ల కస్టమర్‌ తీవ్రంగా అశ్వస్థతకు గురయ్యాడు. పనీర్‌ చిల్లీ స్విగ్గీలో ఆర్డర్‌ పెడితే స్విగ్గీ డెలివరీ బాయ్ చిల్లీ చికెన్‌ డెలివరీ ఇచ్చాడు. దీంతో దానిని తిన్న శాకాహార వ్యక్తి తీవ్ర ఆశ్వస్థతకు గురయ్యాడు. తనకు నాన్-వెజ్ ఫుడ్ డెలివరీ చేశాడని ఆరోపిస్తూ సదరు స్విగ్గీ డెలివరీ బాయ్‌, ఫుడ్‌ పంపిన రెస్టారెంట్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చిల్లీ పనీర్‌కు బదులు చిల్లీ చికెన్‌ డెలివరీ చేశాడని, అది తినడం వల్ల తాను ఆసుపత్రి పాలయ్యానని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అసలింతకీ ఏం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలోని అషియానా కొత్వాలి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి స్విగ్గీలో చిల్లీ పనీర్‌ ఆర్డర్ చేసాడు. అతను బ్రాహ్మణుడు కావడంతో చిల్లీ పనీర్ మాత్రమే తీసుకుని రావల్సిందిగా అలంబాగ్‌లోని చైనీస్‌ ఫ్యూజన్‌ రెస్టారెంట్‌కు జాగ్రత్తలు కూడా చెప్పాడు. కానీ సదర రెస్టారెంట్‌ నిర్లక్ష్యంగా నాన్‌వెబ్‌ ఫుడ్‌ను తయారు చేసి స్విగ్గీలో కస్టమర్‌కు పంపింది. చిల్లీ చికెన్‌ (నాన్ వెజ్) డెలివరీ చేసిన స్విగ్గీ బాయ్‌ వెళ్లిపోయాడు. ఆ విషయం తెలియనక సదరు బ్రాహ్మణ వ్యక్తి దానిని ఆరగించాడు. దీంతో అతను తీవ్ర అశ్వస్థతకు గురయ్యాడు. పొరపాటు గ్రహించిన కస్టమర్‌ అది చిల్లీ చికెన్‌ అని తెలుసుకున్నాడు. తాను శాఖాహారినని, చిల్లీ చెకెన్‌ డెలివరీ చేశారంటూ రెస్టారెంట్‌పై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు చైనీస్ ఫ్యూజన్, స్విగ్గీ డెలివరీ బాయ్‌పై కేసు నమోదు చేసుకున్న అషియానా కొత్వాలి పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. దీనిపై స్పందించిన చైనీస్ ఫ్యూజన్ రెస్టారెంట్ ఈ సంఘటన పొరపాటున జరిగిందని వివరణ ఇచ్చుకుంది.

 

శాఖాహారానికి బదులు నాన్ వెజ్ తినిపిస్తే.. ఇలాంటి కేసుల్లో చట్టం ఏం చెబుతోంది?

ఇవి కూడా చదవండి

కొన్ని నెలల క్రితం ఆగ్రాలో కూడా సరిగ్గా ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆగ్రా-ఫతేహాబాద్ రోడ్‌లోని ఓ హోటల్‌లో అర్పిత్ గుప్తా అనే వ్యక్తికి వెజ్ బదులు నాన్ వెజ్ డెలివరీ చేశారు. వెజ్‌ అనుకుని భుజించిన అర్పిత్‌, అతని స్నేహితుడు రుచి వేరేగా ఉండటం చూసి ఫుడ్‌ను పరిశీలించి చూడగా.. అది చికెన్ రోల్‌గా గుర్తించారు. అనంతరం అర్పిత్ ఆరోగ్యం క్షీణించడంతో అతన్ని ఆసుపత్రిలో చేర్చవలసి వచ్చింది. దీనిపై న్యాయపోరాటానికి దిగిన అర్పిత్‌ కోటి రూపాయల నష్టపరిహారం కోరుతూ కోర్టు కెక్కాడు. ఇలాంటి ఘటనల్లో మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం, ఆహార భద్రత దుర్వినియోగం వల్ల వినియోగదారుడు అనారోగ్యం పాలవ్వడం, ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆహారం ఇచ్చినట్లు తేలితే భారీ జరిమానాతోపాటు జైలు శిక్ష కూడా విధిస్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.