
ప్రతీరోజూ డాక్టర్లు తమకొచ్చిన మెడికల్ కేసులను సాల్వ్ చేసేందుకు మల్లగుల్లాలు పడుతుంటారు. సాధారణ ఔట్-పేషెంట్ కేసులు అటుంచితే.. వారి తెలివికే పదునుపెట్టే చిత్రవిచిత్రమైన కేసులు ఎన్నో ఉంటాయి. వీటిని సాల్వ్ చేయడానికి మెడికల్ జర్నల్స్, అలాగే సీనియర్ డాక్టర్లతో సంప్రదించి.. ఎలాగైనా అందులో విజయం సాధించాలనుకుంటారు. సరిగ్గా అలాంటి కేసు ఒకటి ఇప్పుడు చూసేద్దాం. డైలీ వేజ్ వర్కర్‌గా పని చేస్తోన్న ఓ 30 ఏళ్ల వ్యక్తి తన పొత్తికడుపులో నొప్పంటూ అస్పత్రికొచ్చాడు. తన పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి అంటూ బాధపడ్డాడు. తీరా అక్కడున్న డాక్టర్లు ఎక్స్‌రే తీసి చూడగా.. సదరు వ్యక్తి శరీరంలో 10 సెంటీమీటర్ల గాజు సీసా ఉన్నట్టు గుర్తించారు. ఆ సీసా ఎలా అతడి శరీరంలోకి వెళ్లిందో క్లారిటీ లేదు గానీ.. డాక్టర్లు మాత్రం దాదాపుగా రెండు గంటలు కష్టపడి దాన్ని తొలగించారు. ఆ తర్వాత రెండు రోజులు సదరు రోగిని అబ్జర్వేషన్‌లో ఉంచి.. ఆపై డిశ్చార్జ్ చేశారు.