వావ్‌ ఇది క్యాబ్‌ కాదు..! లగ్జరి సింగిల్ బెడ్‌రూమ్‌ అనుకుంటా..? బెస్ట్‌ డ్రైవర్‌ అవార్డు ఇవ్వాల్సిందే..

ప్రయాణీకులకు టిష్యూ పేపర్ల నుండి టూత్ బ్రష్‌ల వరకు ప్రతిదీ అందుబాటులో ఉన్నాయి. ఈ క్యాబ్‌లో ఉచిత వైఫై సౌకర్యం కూడా ఉంది. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు అవసరమైన మందులు కూడా అందుబాటులో ఉంచాడు. ప్రయాణీకులు కోరుకుంటే వారి ముందు సీటుపై.. వేలాడుతున్న డైరీలో తమ అభిప్రాయాన్ని కూడా తెలియజేయవచ్చు అంటున్నాడు.

వావ్‌ ఇది క్యాబ్‌ కాదు..! లగ్జరి సింగిల్ బెడ్‌రూమ్‌ అనుకుంటా..? బెస్ట్‌ డ్రైవర్‌ అవార్డు ఇవ్వాల్సిందే..
Cab Or 1bhk

Updated on: May 10, 2025 | 2:20 PM

నోయిడాకు చెందిన ఉబర్ డ్రైవర్ అబ్దుల్ ఖాదిర్ తన క్యాబ్ కు ఎంత అందమైన లుక్ ఇచ్చాడంటే.. అది ఓ లగ్జరీ ఇంటికి ఏమాత్రం తీసిపోకుండా కనిపిస్తోంది. ఈ క్యాబ్‌లో ప్రయాణించే వారికి ఆహారం నుండి మందులు, వైఫై వరకు ప్రతి సౌకర్యాన్ని పొందుతారు..ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలో వైరల్‌గా మారడంతో సోషల్ మీడియాలో ప్రజలు అతనిని ప్రశంసలతో ముంచెత్తారు. కొంతమంది భద్రత, గోప్యత గురించి కూడా ఆందోళన చెందుతున్నారు. కానీ అబ్దుల్ వినూత్న ఆలోచనే అతన్ని అందరిలో ప్రత్యేకంగా చేసింది.

నోయిడాకు చెందిన ఉబర్ డ్రైవర్ అబ్దుల్ ఖాదిర్ కారు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా దూసుకుపోతోంది. ఈ ప్రత్యేకమైన క్యాబ్ చూసేందుకు కదిలే 1BHK ఫ్లాట్ లాగా ఉందంటూ ఇంటర్‌నెట్‌ వినియోగదారులు అంటున్నారు. క్యాబ్ లోపల ప్రయాణీకులకు స్నాక్స్, మందులు, బొమ్మలు, వైఫై, షూ పాలిష్ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రైవేట్‌ క్యాబ్‌లో ఇలాంటి ప్రత్యేకమైన ఏర్పాట్ల కారణంగా అబ్ధుల్‌ ఖాదిర్‌ ఎంతోమంది నుంచి ప్రశంసలు పొందుతున్నాడు.

ఇవి కూడా చదవండి

మీరు అబ్దుల్ క్యాబ్‌లో కూర్చున్న వెంటనే మీకు ఓ ఫిలింగ్ కలుగుతుంది. మీరు ఒక చిన్నపాటి హోమ్‌ టూర్‌ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. చాక్లెట్లు, బిస్కెట్లు, ఎనర్జీ డ్రింక్స్, వాటర్ బాటిళ్లు, మందులు సీట్ల వెనుక, వైపులా చిన్న ట్రేలలో సిద్ధంగా ఉంచుతాడు. పిల్లల కోసం బొమ్మలు కూడా ఉన్నాయి. ప్రయాణీకులకు టిష్యూ పేపర్ల నుండి టూత్ బ్రష్‌ల వరకు ప్రతిదీ అందుబాటులో ఉన్నాయి. ఈ క్యాబ్‌లో ఉచిత వైఫై సౌకర్యం కూడా ఉంది. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు అవసరమైన మందులు కూడా అందుబాటులో ఉంచాడు. ప్రయాణీకులు కోరుకుంటే వారి ముందు సీటుపై.. వేలాడుతున్న డైరీలో తమ అభిప్రాయాన్ని కూడా తెలియజేయవచ్చు అంటున్నాడు.

ఇకపోతే, ఇక్కడ మరో ముఖ్య విషయం ఏంటంటే..పేద పిల్లల చదువుకు సహాయం చేయడానికి అబ్దుల్ క్యాబ్‌లో ఒక చిన్న విరాళాల బాక్స్‌ ఏర్పాటు చేశాడు. ఆ పక్కనే అబ్ధుల్‌ ఖాదిర్‌ బెస్ట్‌ ఉబర్ డ్రైవర్లగా గుర్తించిన ఒక వార్తాపత్రిక కటింగ్ కూడా జతచేసి ఉంచాడు.

ఇన్‌స్టాగ్రామ్‌లో, @sheannoying అనే యూజర్ అబ్దుల్ క్యాబ్ ఫోటోలను షేర్ చేస్తూ, ఈ రోజు నేను 1BHK లో ప్రయాణిస్తున్నాను. ఇప్పటివరకు అత్యంత చక్కటి ఉబెర్ రైడ్ అని రాశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అయింది. నెటిజన్లు అబ్దుల్ ను జీనియస్ అని, 5 స్టార్ డ్రైవర్ అంటూ పలు రకాల ట్యాగ్‌లతో ప్రశంసిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..