Viral Video: హర్యానాలో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇద్దరు యువతులు.. పిల్లని దత్తత తీసుకుంటామని వెల్లడి

|

Jun 28, 2024 | 7:47 AM

ఇప్పుడు పెళ్ళికి అర్ధం కూడా మార్చే పనిలో కొంతమంది యువత ఉన్నట్లు పలు సంఘటల ద్వారా తెలుస్తోంది. అమ్మాయిని అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకోవడం.. అబ్బాయిని అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న వార్తలు ఎక్కువగా విదేశాల్లో వినిపించేవి. అయితే ఇప్పుడు మన దేశంలో కూడా ఇలాంటి పెళ్ళిళ్ళు  అడుగు పెట్టాయి. తాజాగా హర్యానాలోని గురుగ్రామ్‌లో ఇద్దరు అమ్మాయిలు పెళ్లితో ఒక్కటయ్యారు. చాలా రోజులుగా ప్రేమించుకుంటున్న ఇద్దరు యువతులు.. సంప్రదాయ పద్దతిలో వివాహం చేసుకున్నారు. ఇప్పుడు వీరి పెళ్లి టాక్‌ టాపిక్‌గా మారింది.

Viral Video: హర్యానాలో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇద్దరు యువతులు.. పిల్లని దత్తత తీసుకుంటామని వెల్లడి
Anju Kavita Marriage
Follow us on

కలియుగంలో ప్రకృతిలో మాత్రమే కాదు మానవ జీవితంలో కూడా ఎన్నో వింతలు విశేషాలు జరుగుతూ ఉంటాయని వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పారు. ఆయన చెప్పిన విషయాలు ఎన్నో నిజం ఇదిగో సాక్ష్యం అంటూ పలు సంఘటలు కళ్ళ మందు కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు పెళ్ళికి అర్ధం కూడా మార్చే పనిలో కొంతమంది యువత ఉన్నట్లు పలు సంఘటల ద్వారా తెలుస్తోంది. అమ్మాయిని అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకోవడం.. అబ్బాయిని అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న వార్తలు ఎక్కువగా విదేశాల్లో వినిపించేవి. అయితే ఇప్పుడు మన దేశంలో కూడా ఇలాంటి పెళ్ళిళ్ళు  అడుగు పెట్టాయి. తాజాగా హర్యానాలోని గురుగ్రామ్‌లో ఇద్దరు అమ్మాయిలు పెళ్లితో ఒక్కటయ్యారు. చాలా రోజులుగా ప్రేమించుకుంటున్న ఇద్దరు యువతులు.. సంప్రదాయ పద్దతిలో వివాహం చేసుకున్నారు. ఇప్పుడు వీరి పెళ్లి టాక్‌ టాపిక్‌గా మారింది.

హర్యానాలోని గురుగ్రామ్‌లో జరిగిన ఓ పెళ్లి హాట్‌ టాపిక్‌గా మారింది. ఇద్దరు యువతులు ఆచార సంప్రదాయాలు పాటిస్తూ, పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహ వేడుకలో ఇతర వివాహాలలో మాదిరిగానే అన్ని వ్యవహారాలు జరిగాయి. పెళ్లిని సంప్రదాయం ప్రకారం జరుపుకుంటూ.. మొదటగా హల్దీ వేడుకతో మొదలు పెట్టారు.. వివాహ కత్రువు అప్పగింతలతో ముగిసింది. కవితా టప్పు, అంజు శర్మలు వధూవరులుగా మారి దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు. వధువు వేషధారణలో ఉన్న కవిత, వరుడి వేషధారణలో ఉన్న అంజు శర్మ వేదికపై కుర్చీలలో కూర్చుని అతిథుల ఆశీర్వాదాలు అందుకున్నారు.

ఇవి కూడా చదవండి

విదేశాల్లో ఒకే లింగానికి చెందిన వ్యక్తులు ప్రేమించి పెళ్లి చేసుకోవడం సహజమే. కానీ భారత్‌లో స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధమైన గుర్తింపు లేదు. అయినప్పటికీ వీరి వివాహం చేసుకున్నారు. ముందు ఇద్దరూ చట్టబద్ధమైన మార్గాన్ని ఆశ్రయించారు. తమకు తెలిసిన వ్యక్తుల సాయంతో పెళ్లికి ప్రయత్నాలు చేశారు. చివరికి లైవ్‌ ఇన్‌ రిలేషన్‌ షిప్‌ సర్టిఫికేట్‌ పొందారు. పెళ్లి తర్వాత దంపతులు తమ ప్రేమ కథ ఎలా మొదలైంది, ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు, చివరికి ఎలా ఒక్కటయ్యారన్న విషయాలను పంచుకున్నారు.

నాలుగేళ్ల నుంచి కలిసి కవితా, అంజు శర్మ కలిసి జీవిస్తున్నారు. ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకున్నారు. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్టుగానే ధైర్యంగా ముందడుగు వేశారు. ముందు తామిద్దరం పెళ్లి చేసుకున్నామని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు అశ్చర్యపోయారు. ఏం చేయాలో తెలియక ఇరువురి తల్లిదండ్రులు తలపట్టుకుని కూర్చున్నారు. చివరికి వారి నిర్ణయాన్ని గౌరవించారు. ఈ వివాహానికి కవిత, అంజుల కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు హాజరయ్యారు.

ప్రస్తుతం తాము చాలా సంతోషంగా ఉన్నామని కవిత తెలిపారు. తమ వివాహం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుందని తెలిసినా పట్టించుకోలేదన్నారు. కానీ తమ కుటుంబాలను ఇందులోకి లాగి వైరల్‌ చేస్తుంటే ఇబ్బందిగా ఉందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఓ బిడ్డను దత్తత తీసుకోవాలనుకుంటున్నామన్నారు.

 

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..