Watch Video: కర్నాటకలో ఆగని మహిళల పోరాటాలు.. బస్సులో జుట్టు జట్టు పట్టుకుని తన్నుకున్న మహిళలు..

|

Jul 28, 2023 | 7:19 PM

Karnataka Bus: కర్ణాటక ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో మహిళల మధ్య గొడవలు ఆగడం లేదు. తరచూ ఎక్కడో ఒక చోట ఘర్షణ పడ్డ వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా తుమకూరు వద్ద బస్సులో ఇద్దరు మహిళలు ఒకరి జట్టు మరొకరు పట్టుకుని తన్నుకున్నారు. వీరిద్దరినీ విడదీసేందుకు మధ్యలో వచ్చిన వ్యక్తిని కూడా ఆ మహిళలు వెనక్కు నెట్టారు. అనంతరం కండక్టర్ జోక్యం చేసుకుని ఇద్దరు మహిళలకు సర్దిచెప్పారు. అసలు ఏం జరిగిందో ఇక్కడ చూడండి..

Watch Video: కర్నాటకలో ఆగని మహిళల పోరాటాలు.. బస్సులో జుట్టు జట్టు పట్టుకుని తన్నుకున్న మహిళలు..
Womens Kicked In Karnataka Bus
Follow us on

సాధారణంగా బస్సు, రైళ్లలో మనం చాలా సార్లు చూసి ఉంటాం. సీట్ల కోసం గొడవలు పడటం.. ఒకరిని మరొకరు తోసుకోవడం. ఆర్టీసీ బస్సుల్లో మాటల యుద్ధాలు కాదు జుట్లు పట్టుకుని కొట్టుకుంటున్నారు. ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటున్నారు. అడ్డొచ్చినవారిని కూడా వదలడం లేదు. కొన్నిసార్లు ఆ గొడవలు చేతులు దాటి పోతున్నాయి. కొట్టుకునే స్థాయికి చేరుతున్నాయి. మరీ ముఖ్యమంగా మహిళలు అయితే ఒకరినొకరు తిట్టుకోవడం మాత్రమేకాదు, జట్లు పట్టుకొని కొట్టుకోవడం చేస్తున్నారు. అచ్చు ఇలాంటి ఘటనే ఒకటి తాజాగా జరిగింది. ప్రస్తుతం కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ ‘శక్తి యోజన’ కింద మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం మొదలు పెట్టినప్పటి నుంచి ఈ గొడవలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మహిళల మధ్య చిచ్చు పెట్టినట్లుగా మారింది. బస్సుల్లో రష్ కారణంగా సీటు కోసం మహిళలు కొట్టుకుంటున్నారు.

తాజాగా కర్ణాటకలో ఓ మహిళ మరో యువతిపై తీవ్ర స్థాయిలో దాడి చేసింది. మొదట చిన్న మాటల స్థాయి నుంచి సృతి మించి చేతులు చేసుకున్నారు. ఆ తర్వాత దీనికి సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే..ఇటీవల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వం ‘శక్తి యోజన’ అనే పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాన్ని చాలా మంది మహిళలు వినియోగించుకుంటున్నారు.

దీంతో బస్సుల్లో ప్రయాణించేందుకు మహిళలు మక్కువ చూపుతున్నారు. దీంతో రద్దీ విపరీతంగా పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే బస్సుల్లోని అన్ని సీట్లను మహిళ ఆక్రమిస్తున్నారు. కొన్ని సార్లు ఈ సీట్ల కోసం బస్సు కిడికీల్లో నుంచి లోపలికి వెళ్లి సీట్లు ఆక్రమిస్తున్నారు. ఆ సమయంలో ఒకరినొకరు దూషించుకుంటూ.. కొట్టుకుంటున్నారు. తోటి ప్రయాణికులు ఎంత నిలువరింప చేసినా వారు ఆగడం లేదు. నానా బూతులు తిట్టుకుంటున్నారు. కొన్నిసార్లు అడ్డుగా వెళ్లినవారిపై కూడా దాడులు చేస్తున్నారు.

ఈ ఘటనలోఓ బస్సు ప్రయాణికుల కోసం బస్ స్టాప్ వద్ద ఆగింది.. అదే సమయంలో అక్కడ ఉన్న కొంతమంది మహిళలు ఒకరి మరొకరు తోసుకుంటూ బస్సులోకి వచ్చేశారు. బస్సులోకి ఎక్కిన వారు సీట్ల కోసం పోటీ పడ్డారు. ఇలా ఆ ఇద్దరు మహిళలు ఒకే సీటులో కూర్చున్నారు. ఒక్కడే అసలు గొడవ మొదలైంది. ముందుగా వచ్చింది తానంటే తానని తిట్టుకున్నారు.. ఇలా చిలికి చిలికి పెద్ద గొడవగా మారింది. అందులోని ఓ యువతి జుట్టు పట్టుకుని కొట్టేసింది మహిళ.

వీడియోను ఇక్కడ చూడండి

మరిన్ని జాతీయ వార్తల కోసం