Amazing Viral Video: సింహం, పులి, చిరుత వంటి జంతువులు చాలా ప్రమాదకరమైనవి. అడవి కూడా వీటి సొంతం.. అడవిలోని జంతువులకు ఇవంటే భయం.. ఇవి ఎటువైపు నుంచి దాడి చేస్తాయో తెలియదు.. వాటి వేట కూడా అంతే భయంకరంగా ఉంటుంది. అడవి జంతువులను వేటాడటమే వీటికి పని.. ఇవి వేట మొదలు పెట్టాయంటే దేనికో మూడిందనే అర్థం. వీటితో పోరాడటం అంటే మరణాన్ని కౌగిలించుకున్నట్లే. ఒక నివేదిక ప్రకారం అడవిలో పులుల సంఖ్య కూడా అధికంగా ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ, అడవిలో పులులను చూడటం కోసం చాలా మంది జంగిల్ సఫారీ చేస్తుంటారు. సోషల్ మీడియాలో మీరు పులులకు సంబంధించిన అనేక వీడియోలను మనం చూడవచ్చు. అయితే ఈ రోజుల్లో రెండు పులులు పోరాడుతున్న వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. ఇది మీరు కూడా చూసి ఆశ్చర్యపోతారు.
నిజానికి ఆ వీడియోలో మొదట రెండు పులులు పోట్లాడుకోవడం కనిపించినా.. ఆ తర్వాత తమ మధ్య ఏమీ జరగనట్టు హాయిగా అడవిలో కలిసి తిరుగుతున్నాయి. రెండు పులులు ఒకదానికొకటి భయంకరంగా దాడి చేసుకుంటాయి. అయితే.. వాటి మధ్య చాలా గొడవలు జరిగినా వెంటనే కోపం కూడా చల్లారిపోతుంది. సులువుగా కలిసి అడవిలోకి వెళ్లిపోతాయి.
అద్భుతమైన ఈ వీడియోలో ‘జంగిల్ లైఫ్’ కనిపిస్తుంది. ఇలాంటివి చాలా అరుదుగా కనిపిస్తాయి. ఐఎఫ్‌ఎస్ అధికారి సురేందర్ మెహ్రా ఈ వీడియోను తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. ‘పోరాటం , స్నేహం.. అడవిలో జీవిత ఇది సహజం’ అని క్యాప్షన్‌లో రాశారు. అన్ని పోరాటాలు ప్రాదేశిక యుద్ధాలు కావు అని పేర్కొన్నారు.
Fight and Friendship ??#JungleLife is full of secrets.
All fights are not territorial fights..#TigerFacts #JungleDiaries @susantananda3 @ipskabra pic.twitter.com/T50fl2Jh1D— Surender Mehra IFS (@surenmehra) December 25, 2021
ఈ ఫన్నీ ఫైట్ వీడియోను ఇప్పటివరకు 2 వేలకు పైగా వీక్షించగా, వందలాది మంది వీడియోను కూడా లైక్ చేశారు. ఇదే సమయంలో పలువురు తమాషా కామెంట్లు కూడా చేశారు.
ఇవి కూడా చదవండి: New Year Recipe: న్యూ ఇయర్ వేడుకల్లో మోజారెల్లా స్టిక్స్ మీ కుటుంబ సభ్యులను ఖుష్ చేయండి.. వీటి ఇలా ట్రై చేయండి..
Trending Video: అయ్యో..! ఆపదలో పప్పి.. చూసిన మరో కుక్కపిల్ల ఏం చేసిందో తెలుసా..