Viral News: పెంపుడు జంతువులపై అమితమైన ప్రేమ.. గ్రాండ్ గా బర్త్ డే సెలబ్రేషన్స్.. ఎలా అంటే..

పెంపుడు జంతువులంటే ప్రేమించని వారెవరుంటారు. అలాగే జంతువులంటే ఇష్టపడని వారుంటారు. అయితే జంతువులను పెంచుకునే వారు వాటిపై చూపించే ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. తమ ఇంట్లో పిల్లలను..

Viral News: పెంపుడు జంతువులపై అమితమైన ప్రేమ.. గ్రాండ్ గా బర్త్ డే సెలబ్రేషన్స్.. ఎలా అంటే..
Pet Birthday

Edited By:

Updated on: Aug 31, 2022 | 6:17 PM

Viral News: పెంపుడు జంతువులంటే ప్రేమించని వారెవరుంటారు. అలాగే జంతువులంటే ఇష్టపడని వారుంటారు. అయితే జంతువులను పెంచుకునే వారు వాటిపై చూపించే ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. తమ ఇంట్లో పిల్లలను ఎంత ప్రేమగా చూసుకుంటారో పెంపుడు జంతువులనుమ అలాగే చూసుకుంటారు. అయితే తన పెంపుడు కుక్కపై అమితమైన ప్రేమతో ఓ మహిళ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మన ఇంట్లో పిల్లల పుట్టినరోజులు గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తూ ఉంటాం.. పిల్లలకి కొత్త బట్టలు కొని.. ఇంట్లో బెలూన్ డెకరేషన్ చేసి.. కేక్ కోయిస్తాం. మరి శునకానికి కూడా అదే స్టైల్ లో బర్త్ డే సెలబ్రేషన్ చేస్తే ఎలా ఉంటుంది.

కుక్కలకి బర్త్ డే సెలబ్రేషన్ ఏంటనుకుంటున్నారా.. క్రిస్టల్ అనే మహిళ తన ట్వి్ట్టర్ పేజిలో తన పెంపుడు కుక్క బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలను షేర్ చేసింది. రెండో పుట్టినరోజు అని తెలిపేలా ప్లేక్సీ, తన పెంపుడు శునకానికి కొత్త డ్రెస్.. బెలూన్లతో డెకరేషన్ చేసి.. రెండు కేకులను కోయించింది. ఈపోటోలు తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది క్రిస్టల్. మా అబ్బాయికి రెండు సంవత్సరాలు అనే క్యాప్షన్ తో ఈఫోటోలను క్రిస్టల్ షేర్ చేయగా.. వేల సంఖ్యలో ట్విట్టర్ వినియోగారులు లైక్‌ లు కొట్టి కామెంట్స్ చేస్తున్నారు.పెంపుడు జంతువులంటే ఈ తల్లికి ఎంత ప్రేమ అంటూ కొందరు కామెంట్లు చేస్తుంటే.. హ్యాపీ బర్త్ డే అంటూ మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..