విమాన యానం…. ఒకప్పుడు ఒక కల..! కానీ.. ఇప్పుడు సామాన్యులు సైతం విమాన ప్రయాణం చేయగలుగుతున్నారు. అయితే.. విమాన యానంలానే.. ఇప్పుడు అంతరిక్షం యానం రెడీ అయ్యింది. మొన్న వర్జిన్ గెలాక్టిక్ రోదసియానం సక్సెస్ కాగా.. తాజాగా.. జెఫ్ బెజోస్‌కు చెందిన న్యూ షెపర్డ్ నౌక రోదసియాత్ర విజయవంతమైంది. న్యూ షెపర్డ్ వ్యోమనౌకలో నలుగురు సభ్యుల బృందం… నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి వెళ్లి.. సురక్షితంగా భూమిపై ల్యాండై.. సరికొత్త రికార్డు సృష్టించారు. రోదసీలోకి ప్రపంచ కుబేరుడు, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్ర విజయవంతమైంది. స్పేస్ టూరిజం లక్ష్యంగా జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్ర కొనసాగింది. బ్లూ ఆరిజిన్ సంస్థ న్యూ షెపర్డ్ వ్యోమనౌకలో జెఫ్ బెజోస్ బృందం రోదసీలోకి వెళ్లొచ్చింది. ప్యారాచూట్ల ఉన్న క్యాప్సూల్స్ ద్వారా భూమిపైకి బెజోస్ బృందం సురక్షితంగా ల్యాండ్ అయింది. అయితే జెఫ్ బెజోస్ బృందం అంతరిక్ష యాత్రపై నెట్టింట్లో జోకులు పేలుతున్నాయి. దీని గురించి సోషల్ మీడియాలో చాలా మీమ్స్ షేర్ చేస్తున్నారు. ఎందుకో తెలిస్తే మీరుకూడా మరో మీమ్ పెట్టేస్తారు.. ఓసారి వారు పెట్టి మీమ్స్ చూద్దాం..
Jeff Bezos’s flight into space. Summary#BlueOrigin #JeffBezos #space pic.twitter.com/GnpN4zX2V0
— Domenico Gagliardi (@DGagliardi96) July 20, 2021
Me Trying to touch Space
#BlueOrigin#JeffBezos pic.twitter.com/CiVCrdqGRw
— Ashwath (@ash_75_) July 20, 2021
The man who designed #JeffBezos Rocket!!?.. pic.twitter.com/RK6UM0Dmwj
— Rahul Rajan (@rajanrahul58) July 20, 2021
is Jeff going to wear cowboy boots into space https://t.co/kyqTZh0HfK
— em (@croclovur) July 20, 2021
సోషల్ మీడియాలో జెఫ్ బెజోస్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. చాలా మంది అతని డ్రెస్, బూట్లు ఎగతాళి చేస్తున్నారు. మరోవైపు, కౌబాయ్ లాగా, బూట్లు, టోపీ ధరించి అంతరిక్షంలోకి ఎలా వెళ్తాడు అంటూ ప్రశ్నిస్తున్నారు.
బెజోస్ అంతరిక్షంలో ప్రయాణించిన రెండవ బిలియనీర్ అయ్యాడని అంటున్నారు. అతని ముందు బ్రిటిష్ వ్యాపారవేత్త రిచర్డ్ బ్రాన్సన్ వర్జిన్ గెలాక్సీలో ఫ్లైట్ పూర్తి చేసి తిరిగి వచ్చాడు. అంటూ సరదా కామెంట్స్ చేస్తున్నారు.