Viral Video: మామిడికాయ తినాలనుకున్న తాబేలు..ఏం చేసిందంటే..! క్యూట్‌ వీడియో వైరల్‌.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

తాబేలు చాలా నెమ్మదిగా నడుస్తుంది. ఇవి భూమిపై ఉంటాయి. అలాగే, నీటిలోనూ జీవించే సామర్థ్యం వీటికుంటుంది. ముఖ్యంగా తాబేళ్లు పిల్లలు పెట్టే సమయంలో మాత్రమే భూమిపై ఎక్కువగా వస్తుంటాయని చెబుతారు. అయితే, అలాంటి తాబేలు దొంగతనం చేస్తుందంటే నమ్ముతారా..? సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోలో ఒక తాబేలు ఏం చేస్తుండో మీరే చూడండి..

Viral Video: మామిడికాయ తినాలనుకున్న తాబేలు..ఏం చేసిందంటే..! క్యూట్‌ వీడియో వైరల్‌.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
Tortoise

Updated on: Sep 16, 2025 | 2:02 PM

Cute Turtle Video Watch Now: సోషల్ మీడియాలో ఇటీవల తాబేళ్లకు సంబంధించిన వార్తలు, వీడియోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. ఈ క్రమంలోనే మరో తాబేలు వీడియో ఇంటర్‌ నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. అయితే, తాబేలు అనగానే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది దాని నెమ్మదైన నడక. తాబేలు చాలా నెమ్మదిగా నడుస్తుంది. ఇవి భూమిపై ఉంటాయి. అలాగే, నీటిలోనూ జీవించే సామర్థ్యం వీటికుంటుంది. ముఖ్యంగా తాబేళ్లు పిల్లలు పెట్టే సమయంలో మాత్రమే భూమిపై ఎక్కువగా వస్తుంటాయని చెబుతారు. అయితే, అలాంటి తాబేలు దొంగతనం చేస్తుందంటే నమ్ముతారా..? సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోలో ఒక తాబేలు ఏం చేస్తుండో మీరే చూడండి..

వైరల్‌ వీడియో తాబేళ్ల పార్క్‌లో జరిగిన సంఘటన అని తెలిసింది. పార్క్‌ ఉన్న మామిడి చెట్టు కింద ఒక తాబేలు అటు ఇటు తిరుగుతూ కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఆ తాబేలు చెట్టుపైన ఉన్న మామిడికాయలను చూస్తుంది. అంతే వాటి కోసం తన శక్తినంతా కూడగట్టుకుని తెంచుకునే ప్రయత్నిస్తుంది. చెట్టుపైనున్న మామిడికాయను తినేందుకు వీలైనంతవరకు దాని మెడను పైకి చాచేందుకు ప్రయత్నిస్తుంది. కానీ, పాపం అదే సమయంలో గాలికి కొమ్మలు అటు ఇటు ఊగుతూ తాబేలు నోటి దగ్గరికి వచ్చి మరి కదిలి పక్కకు వెళ్తోంది. ఇదంతా వైరల్‌ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

వీడియోలో ఆ తాబేలు మామిడికాయ కోసం చాలా సేపు ట్రై చేస్తుంది. తన మెడను చాచి అలాగే ఆ కాయ కోసం ఎదురుచూస్తూనే ఉంటుంది. గాలి వీస్తుండడం చెట్టు అటూ ఇటూ ఊగడంతో దానికి ఆ కాయ అందకుండా పోతుంది. దీంతో చేసేది ఏమీ లేక పాపం బుచ్చి తాబేలు దాని దారిన అది వెళ్లిపోతుంది. దీనికి సంబంధించిన వీడియోను ‘BackyardGarden_Torto’ అనే ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి పోస్ట్ చేశారు. క్యాప్షన్‌గా దొంగ చాటున తాబేలు మామిడిపండు తినాలని చూస్తోంది అంటూ సరదగా రాశారు. ఇక వీడియో చూసిన వినియోగదారులు ఒక్కొక్కరూ ఒక్కో విధంగా వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..