Viral Video: ఉద్యోగిపై పూల కుండీతో దాడి చేసిన సీఈఓ.. హత్య ప్రయత్నం కింద అరెస్ట్ చేయమంటున్న నెటిజన్లు

ఒక కంపెనీ CEO తన ఉద్యోగిని కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాస్తవానికి ఇద్దరి మధ్య వాదనతో గొడవ ప్రారంభమైంది. కొద్దిసేపటికే CEOకి తనతో వాదిస్తున్న ఉద్యోగిపై చాలా కోపం వచ్చింది. అతను ఆలోచించకుండా.. రెండుసార్లు అక్కడ డెస్క్ మీద ఉంచిన పూల కుండను తీసుకొని ఉద్యోగిని కొట్టాడు.

Viral Video: ఉద్యోగిపై పూల కుండీతో దాడి చేసిన సీఈఓ.. హత్య ప్రయత్నం కింద అరెస్ట్ చేయమంటున్న నెటిజన్లు
Viral Videe
Image Credit source: X/@ersineroglu_

Updated on: Sep 05, 2025 | 6:04 PM

ఏ కంపెనీలోనైనా, ఉద్యోగులు, బాస్ మధ్య ఎప్పుడూ కొంత గ్యాప్ ఉంటుంది. అయితే బాస్ , ఉద్యోగి వాదించుకుంటూ గొడవ పడటం చూడటం చాలా అరుదు. ప్రస్తుతం అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది. నిజానికి బాస్ కి , ఆఫీసులో ఒక ఉద్యోగి మధ్య చాలా వాదన జరిగింది. కోపంతో బాస్ అతని తలపై పూల కుండతో కొట్టాడు. దీంతో ఉద్యోగి గాయపడ్డాడు. ఈ షాకింగ్ సంఘటన టర్కీలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

టర్కిష్ టెక్నాలజీ పోర్టల్ షిఫ్ట్ డిలీట్ సీఈఓ హక్కీ అల్కాన్ తన ఉద్యోగి సమేత్ జాంకోవిచ్ పై పూల కుండ విసిరిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో నెటిజన్లలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. టర్కియే టుడే నివేదిక ప్రకారం గత నాలుగు సంవత్సరాలుగా అక్కడ పనిచేస్తున్న ఉద్యోగిపై సీఈఓ కంకర రాళ్లతో నిండిన పూల కుండను విసిరాడు.

ఇవి కూడా చదవండి

ఈ విషయం కోర్టుకు చేరింది
బాధిత ఉద్యోగి సమేత్ జాంకోవిక్‌ మాట్లాడుతూ ‘దాడికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్ నాకు అందింది. ఈ ప్రక్రియ కోర్టులో ఉంది. ఈ ప్రక్రియ తర్వాత కూడా నేను నా మార్గంలోనే కొనసాగుతానని స్పష్టం చేయాలనుకుంటున్నాను. ఏమి జరిగినా ప్రతి యుగానికి దాని స్వంత వ్యక్తి ఉంటాడు. కాల చక్రం ఖచ్చితంగా తిరుగుతుంది’ అని అన్నారు. ఇంతలో CEO కూడా ఒక ప్రకటన చేశాడు. తాను ఉద్యోగిని కొట్టినది.. పూల కుండీతో కాదు, ‘పువ్వుల కొమ్మ’ అని అన్నారు. ఇప్పుడు CEO చేసిన ఈ ప్రకటన విషయ తీవ్రతను తగ్గించింది.

CEO హక్కీ అల్కాన్ ఏమి చెప్పారు?
వాదన జరుగుతున్నప్పుడు నా కోపాన్ని అదుపు చేసుకోలేకపోయాను. దీంతో నా దగ్గర ఉన్న పూల కొమ్మను అతని డెస్క్ వైపు విసిరాను.. అది అతనిని తాకింది. అదృష్టవశాత్తూ అతనికి ఎలాంటి గాయాలు కాలేదు. సంఘటనకు ముందు, తరువాత ఆఫీసులో ఉన్న భద్రతా కెమెరా ఫుటేజీని కూడా అధికారులకు అందజేశాను’ అని CEO అల్కాన్ అన్నారు.

వైరల్ వీడియో చూడండి

అయితే, ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజనలు CEO ని ట్రోల్ చేస్తున్నారు. ‘హత్య ప్రయత్నం కింద అతన్ని అరెస్టు చేయండి, ఎందుకంటే అతనికి పశ్చాత్తాపం లేదు. కుండీ విసిరిన తర్వాత కూడా అతను వాదించాడు అని రకరకాల కామెంట్స్ చేస్తూ CEO చేసిన పనిని నిరసిస్తున్నారు.

 

మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..