Viral Video: స్నేహం అంటే ఇదేరా..! ఫ్రెండ్ ని రక్షించేందుకు అలలతో పోరాడిన స్నేహితులు .. వీడియో వైరల్

స్నేహానికి కంటే గొప్ప బంధం ఈ లోకంలో లేదు అని సినీ కవి చెప్పినా.. కష్టంలో తోడుగా నిలచేవాడు.. బాధపడితే కన్నీరు తుడిచేవాడు, నీలో తప్పులను నీకు... నీ మంచిని మందికి చెప్పేవాడు.. తాను ఓడి... నిన్ను గెలిపించే వాడు... మొత్తంగా ... రెండు దేహాలు... ఒక ప్రాణం.. ఒక నడక అని నిలిఛి నడచేవాడు స్నేహితుడు అని పెద్దలు చెబుతారు. అందుకనే స్నేహితులకు సంబంధించిన ఏ విషయం అయినా సరే నెటిజన్లను ఆకర్షిస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు తన స్నేహితుడు కష్టంలో ఉంటే నిజమైన స్నేహితుడి.. తన ప్రాణాలను సైతం లెక్క చేయడు అని చెప్పడానికి ఈ వీడియో సాక్షం అని కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియో చూసి ఇలా ఎందుకు అన్నారో చూడండి.

Viral Video: స్నేహం అంటే ఇదేరా..! ఫ్రెండ్ ని రక్షించేందుకు అలలతో పోరాడిన స్నేహితులు .. వీడియో వైరల్
Viral Video

Updated on: Aug 04, 2025 | 11:46 AM

సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో సముద్రం గట్టు మీద కొంతమంది యువకులు నిల్చుని ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఆ వీడియోలో ఒక వ్యక్తి సముద్రపు అలలలో మునిగిపోతున్నట్లు.. అతన్ని రక్షించడానికి ఒక యువకుడు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. మునిగిపోతున్న వ్యక్తి తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అతనిని చూస్తుంటే నీటిలో ఈదడం అతనికి తెలియదని అనిపిస్తుంది. ఇంతలో ఈత తెలిసిన ఒక వ్యక్తి మునిగిపోతున్న వ్యక్తిని రక్షించడానికి దూకాడు.. అయితే అతను కూడా రక్షించలేక ఇబ్బంది పడుతుంటే.. మరొకరు తన స్నేహితులిద్దరి కోసం సముద్రంలోకి దూకాడు.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.

ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. వీడియోను షేర్ చేసి.. ఈ రోజు స్నేహం తీరాలను ఆలింగనం చేసుకుంది.. అప్పుడు ఆ స్నేహాన్ని చూసి అలలు కూడా ఆగిపోయాయి అని దానికి ఒక కామెంట్ జత చేశారు. సముద్రపు లోతు.. అలలు భయపెడతాయని అందరికీ తెలిసిందే. అయితే నిజమైన స్నేహితుడు మీతో ఉన్నప్పుడు.. ప్రతి కష్టం తేలికగా అనిపిస్తుంది. ఎటువంటి అల అయినా సరే నెమ్మదిగా తలవంచుకుని సముద్రంలోపలికి వెళ్ళిపోతుంది. వైరల్ వీడియోలో ఇద్దరు స్నేహితులు ప్రాణాలను కాపాడుకునేందుకు అలలతో పోరాడుతూనే ఉన్నారు. దీంతో మూడవవాడు ఏమీ ఆలోచించకుండా, తన ప్రాణం గురించి పట్టించుకోకుండా… వారిని కాపాడటానికి సముద్రంలోకి దూకాడు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ మనం ఈత కొట్టడం గురించి తెలుసుకునే సమయం కాదు.. భావోద్వేగాల గురించి తెలుసుకోవాల్సిన సమయం ఇది. పరిస్థితులకు అతీతమైనది స్నేహం. జీవితపు నావ ఊగడం ప్రారంభించినప్పుడు.. అలాంటి సమయంలో స్నేహితులు దేవుని రూపంలో వస్తారు. స్నేహంలో ద్వేషం, ఈర్ష వంటి భావాలు ఉండవు. కేవలం నమ్మకం మాత్రమే ఉంటుంది. ఈ రోజు ఈ వీడియోలో మనం చూశాము. నిజమైన స్నేహితులు తోడుగా ఉంటే జీవితంలో ప్రతిదీ తిరిగి పొందవచ్చని ఈ క్షణం మనకు నేర్పింది. అందుకనే నిజమైన స్నేహితుడు అమూల్యమైన వజ్రం వంటివివాడు అని కామెంట్ చేస్తున్నారు.

 

మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..