DTR: కరెంట్‌ ట్రాన్స్‌ఫార్మర్‌లో ఉండే ఆయిల్‌తో మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి పూర్తిగా తగ్గిపోతుందా? అసలు నిజం ఏంటి?

ట్రాన్స్‌ఫార్మర్ ఆయిల్ మోకాళ్ళ, నడుము నొప్పులను తగ్గిస్తుందనేది ఒక అపోహ. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదు. నిజానికి DTR ఆయిల్ ఇన్సులేషన్, కూలింగ్ కోసం వాడే శుద్ధి చేసిన మినరల్ ఆయిల్. దీనిని శరీరానికి రాసుకోవడం వలన ఆరోగ్య సమస్యలు రావచ్చు.

DTR: కరెంట్‌ ట్రాన్స్‌ఫార్మర్‌లో ఉండే ఆయిల్‌తో మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి పూర్తిగా తగ్గిపోతుందా? అసలు నిజం ఏంటి?
Transformer Dtr

Updated on: Jan 19, 2026 | 7:00 AM

విద్యుత్‌ స్తంభాలకు అక్కడక్కడా ట్రాన్స్‌ఫార్మర్స్‌ ఉండటం గమనించే ఉంటారు. వాటిని DTR (డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్) అని పిలుస్తారు. సబ్‌స్టేషన్‌ నుంచి వచ్చే విద్యుత్‌ను ట్రాన్స్‌ఫామ్‌ చేసి.. ఇళ్లకు విద్యుత్‌ సరఫరా అయ్యేలా చేస్తుంది. అయితే అందులో ఒక రకమైన ఆయిల్‌ ఉంటుంది. అది ఎప్పుడైనా చెడిపోయిన సమయంలో విద్యుత్‌ అధికారులు, లైన్‌మెన్లు దాన్ని ఓపెన్‌ చేసి రిపేర్‌ చేస్తుంటారు. ఆ సమయంలో కొంతమంది అక్కడ చేరి.. అందులోని ఆయిల్‌ను కొంత ఇవ్వమని అడిగి తీసుకొని.. చిన్న సీసాలో తీసుకెళ్తారు.

అది ఎందుకంటే.. మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి ఉంటే ఆ ఆయిల్‌ రాసుకుంటే పూర్తిగా తగ్గిపోతుందని చెబుతుంటారు. ఇది చాలా చోట్ల జరుగుతుంది. ఈ పుకారు ఎలా వచ్చిందో తెలియదు కానీ డీటీఆర్‌లోని ఆయిల్‌ చాలా మంది రాసుకున్నారు. మరి నిజంగానే మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి తగ్గుతుందా అంటే దానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదు. పైగా ఇది ఒక పుకారు అని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ట్రాన్స్‌ఫార్మర్‌లో ఆయిల్‌ సాధారణంగా అధిక శుద్ధి చేసిన మినరల్ ఆయిల్, దీనిని ఇన్సులేషన్ కోసం, వేడిని తగ్గించి, కూల్‌గా ఉండేందుకు, వైండింగ్‌ల వంటి అంతర్గత భాగాల ఆక్సీకరణను నిరోధించడం కోసం ఉపయోగిస్తారు. ట్రాన్స్‌ఫార్మర్ సురక్షితంగా, సమర్ధవంతంగా పనిచేస్తుందని నిర్ధారిస్తుంది. ఇది ఆర్సింగ్‌ను నిరోధించడానికి డైఎలెక్ట్రిక్ (ఇన్సులేటర్)గా, వేడిని నిర్వహించడానికి కూలెంట్‌గా పనిచేస్తుంది, ట్రాన్స్‌ఫార్మర్‌ను నష్టం, క్షీణత నుండి కాపాడుతుంది. అంతే తప్పితే ఇందులో నొప్పిని తగ్గించే ఎలాంటి లక్షణాలు ఉండవు.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి