ప్రజా రవాణాలో రైల్వే వ్యవస్థ (Railways) అత్యంత కీలకం. రోడ్డు వ్యవస్థ తర్వాత అధిక మొత్తంలో ప్రయాణికులు రైళ్ల ద్వారానే జర్నీ చేస్తున్నారు. సాధారణంగా రైలు పట్టాలు మానవ నివాస ప్రాంతాలకు దూరంగా ఉంటాయి. ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు రైల్వే ట్రాకులను జనావాసాలకు దూరంగా నిర్మిస్తారు. అయినప్పటికీ కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతాయి. కానీ చైనా లో మాత్రం ఓ రైలు నివాస సముదాయానికి దూరంగా కాకుండా.. ఓ అపార్ట్మెంట్ లోపలి నుంచి చుక్ చుక్ మంటూ పరుగులు పెడుతుంది. ఈ వీడియో చూశాక కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతోంది. ఎత్తైన వంతెన గుండా వెళుతున్న రైలు అకస్మాత్తుగా 6-7 అంతస్తుల భవనంలోకి ప్రవేశించడాన్ని వీడియోలో చూడవచ్చు. ఈ రైల్వే ట్రాక్ చైనాలోని చాంగ్‌కింగ్‌లోని ఎత్తైన భవనం నుంచి సాగుతుంది. ఎక్కువ ఎత్తులో ఉండే భవనాల కారణంగా ఈ నగరాన్ని ‘మౌంట్ సిటీ’ అని పిలుస్తారు. ఈ ప్రాంతం చైనాలోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాలలో ఒకటి. ఇక్కడి జనాభా 30 మిలియన్ల కంటే అధికంగా ఉంటుందని అక్కడి అధికారులు చెబుతున్నారు.
A train runs through residential apartments in China pic.twitter.com/4n0MhsVOho
ఇవి కూడా చదవండి— H0W_THlNGS_W0RK (@wowinteresting8) August 14, 2022
విశేషమేమిటంటే.. రైలు వెళ్లినప్పుడు ఆ భవనంలో నివసించే వారికి దాని శబ్దం కూడా వినిపించదు. ఈ రైలు వీడియో @wowinteresting8 అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. కేవలం 11 సెకన్ల ఈ వీడియోను ఇప్పటి వరకు 5 లక్షల 58 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..