Viral Video: ఓర్నీ.. ఇదెక్కడి విడ్డూరం..! ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన రైలు.. వైరలవుతున్న వీడియో🤣😂

|

Aug 14, 2023 | 7:54 PM

రోడ్డుపై రద్దీ కారణంగా రైలు ఆగిపోవడంతో ట్రాఫిక్ పోలీసు సిబ్బంది ట్రాఫిక్‌ను నిర్వహించలేకపోయారు. ట్రాఫిక్‌ జామ్‌ను క్లియర్ చేయడానికి ట్రాఫిక్ పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. వాస్తవానికి ఇక్కడ రైల్వే ట్రాక్‌పై చాలా వాహనాలు రద్దీ కారణంగా ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.. దీంతో ఈ ట్రాక్ మీదుగా వెళ్లే రైలును ఆపేయాల్సి వచ్చింది. ఈ సమయంలో అక్కడ వాహనాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ట్రాఫిక్‌ పోలీసులు ఎంత ప్రయత్నించినా జామ్‌ క్లియర్‌ కాలేదు.

Viral Video: ఓర్నీ.. ఇదెక్కడి విడ్డూరం..! ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన రైలు.. వైరలవుతున్న వీడియో🤣😂
Train Stuck In Traffic
Follow us on

రోడ్డుపై ట్రాఫిక్‌ జామ్‌లో చిక్కుకున్న చాలా వాహనాలను మీరు చూసి ఉంటారు. కానీ, మీరు ఎప్పుడైనా రైలు జామ్‌లో చిక్కుకోవడం చూశారా? మీరు చూడకపోతే ఈ వార్త మీకోసమే. ఈ రోజుల్లో ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో ఒక రైలు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుంది. లోకో పైలట్ ప్రజలను దూరంగా వెళ్లమని పదేపదే అడుగుతున్నా, అక్కడి స్థానికులేవరూ పట్టించుకోవడం లేదు. ఉత్తరప్రదేశ్‌లోని బనారస్‌లో రైలు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన వింత ఘటన చోటుచేసుకుంది. అవును, మీరు చదివింది నిజమే. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో బనారస్‌లో పరిస్థితిని వివరిస్తుంది. బనారస్‌లోని రైల్వే గేట్ దగ్గర ట్రాఫిక్‌ జామ్ కారణంగా రైలునే ఆపేయాల్సి వచ్చింది. ఇక్కడ రైల్వేగేటు ఎత్తివేయడంతో ఇటువైపు నుంచి అటు, అటు వైపు నుంచి ఇటు.. వాహనాలు వెళ్లడం ప్రారంభించడంతో పెద్దఎత్తున జామ్‌ ఏర్పడింది.

ఉత్తరప్రదేశ్‌లోని బనారస్‌లోని రైల్వే క్రాసింగ్‌పై రైలు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో రైల్వే క్రాసింగ్‌పై ట్రాఫిక్‌ కారణంగా ఎక్స్‌ప్రెస్ రైలు నిలిచిపోయింది. ట్రాఫిక్ కారణంగా రైలు ఆగిపోవడంతో ట్రాఫిక్ పోలీసు సిబ్బంది ట్రాఫిక్‌ను నిర్వహించలేకపోతున్నారని వైరల్‌ వీడియో చూస్తే తెలుస్తుంది. ట్రాఫిక్‌ జామ్‌ను క్లియర్ చేయడానికి ట్రాఫిక్ పోలీసులకు కూడా పెద్ద తలనొప్పిగా మారిందని వీడియోలో కనిపిస్తోంది. వాస్తవానికి, రైల్వే ట్రాక్‌పై చాలా వాహనాలు రద్దీ కారణంగా నిలిచిపోయాయి.. దీంతో ఈ ట్రాక్ మీదుగా వెళ్లే రైలును ఆగిపోవాల్సి వచ్చింది. ఈ సమయంలో అక్కడ వాహనాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ట్రాఫిక్‌ పోలీసులు ఎంత ప్రయత్నించినా జామ్‌ క్లియర్‌ కాలేదు.

ఇవి కూడా చదవండి

ఇప్పటివరకు సోషల్ మీడియాలో ఎనిమిదిన్నర లక్షల మందికి పైగా ఈ వీడియోను చూశారు. అదే సమయంలో, చాలా మంది వినియోగదారులు ఈ వీడియోపై భిన్నమైన కామెంట్స్‌ చేస్తున్నారు. ఒక వినియోగదారు ఇలా వ్రాశారు.. ‘ఇలాంటి ఘటనలు కేవలం భారతదేశంలో మాత్రమే సాధ్యమంటూ నెటిజన్లు కామెంట్‌ చేశారు. మరొక వినియోగదారు స్పందిస్తూ.. రైలుకు చాలన్‌ వేయకండి అని రాశారు. ఒక వినియోగదారు ‘వెల్‌కమ్ టు బనారస్’ అని రాశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..