స్నేహంలో కొందరు ప్రజలు వస్తువులపై పందెం వేస్తారు. కొంత ఎత్తు నుండి దూకడం లేదా చాలా దూరం ఈత కొట్టడం వంటివి పందెంగా పెట్టుకుంటారు. మరికొందరు వేగంతో డ్రైవింగ్ చేయడం వంటివి కూడా చేస్తుంటారు. ఇలాంటి పందెంలో కొందరు తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టడానికి భయపడరు. లక్నోలోని ఇటౌంజాలో కూడా ఇద్దరు వ్యక్తుల మధ్య పందెం జరిగింది. ఈ పందెం నెరవేర్చడానికి ఒక వ్యక్తి దారుణంగా మరణించాడు. ఈ సంఘటన జూన్ 22 న జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగింది. జూన్ 22న హిమ్మత్‌నగర్ అట్రియాకు చెందిన యువకులు ట్రాక్టర్ స్టంట్‌పై రూ.15,000 పందెం కాశారు. 22 ఏళ్ల నీరజ్ మౌర్య, జోగిందర్ యాదవ్ తమ ట్రాక్టర్లకు గొలుసులు కట్టారు. వాటిని ముందుకు లాగేందుకు పోటీపడ్డారు. కాగా, స్టంట్ ప్రారంభమైన కొద్ది సెకండ్లలోనే నీరజ్ మౌర్య నడిపిన ట్రాక్టర్ నిటారుగా పైకిలేచింది. ఆ తర్వాత అది పూర్తిగా బోల్తాపడింది. దీంతో రూ.15,000 పందెం కాసిన నీరజ్ మౌర్య ఆ ట్రాక్టర్ కింద నలిగిపోయాడు. అక్కడికక్కడే మరణించాడు.
Life lost in tractor stunt
In Lucknow’s Itaunja, a bet was placed between two young men. They had to show the crowd whose tractor was stronger. There was a prize of 15 thousand for this. In this stunt, the tractor overturned and a young man died.#Viralvideo #lucknow pic.twitter.com/Te5FmNtcY4
— Siraj Noorani (@sirajnoorani) June 23, 2024
ట్రాక్టర్ల స్టంట్ చూసేందుకు అక్కడ గుమిగూడిన గ్రామస్తులు ఇది చూసి షాక్ అయ్యారు. నీరజ్‌ను కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. మరోవైపు ఈ విషయం తెలిసిన పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరో ట్రాక్టర్ డ్రైవర్ జోగిందర్ యాదవ్‌ను అరెస్ట్ చేశారు. కాగా, ట్రాక్టర్ స్టంట్‌కు సంబంధించిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..