Viral Video: సింహాన్ని ముప్పుతిప్పలు పెట్టిన తాబేలు.. గుక్కెడు నీళ్లు తాగనిస్తే ఒట్టు..!

|

Apr 13, 2022 | 10:46 AM

వేసవి తాపంతో నీరు తాగేందుకు వచ్చిన సింహంను ఓ చిన్న తాబేలు భయపెట్టింది. సింహం భయంతో తప్పుకునే వీడియో ఒకటి ఈ మధ్య సోషల్ మీడియాలో..

Viral Video: సింహాన్ని ముప్పుతిప్పలు పెట్టిన తాబేలు.. గుక్కెడు నీళ్లు తాగనిస్తే ఒట్టు..!
Tortoise Challenged Lion
Follow us on

అడవికి రాజు సింహం. వేట మొదలు పెట్టిందంటే చాలు అడవి వణికిపోయేది. అందుకే సింహం ఎంట్రీ ఇచ్చిందంటే జంతులు పారిపోవల్సిందే. సింహం వేటాడేందుకు బయటకు వచ్చినప్పుడు ఏ జంతువు కూడా దాని ముందు నిలబడటానికి ధైర్యం చేయదు. అలాంటి సింహంకు చుక్కలు చూపించింది. వేసవి తాపంతో నీరు తాగేందుకు వచ్చిన సింహంను ఓ చిన్న తాబేలు భయపెట్టింది. సింహం భయంతో తప్పుకునే వీడియో ఒకటి ఈ మధ్య సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే మనం ఇంతకాలం మనం తాబేలు, కుందేలు కథను చాలా విని ఉంటాం. నిరంతర శ్రమతో పరుగు పెట్టిన తాబేలు చివరికి తన ప్రత్యర్థి కుందేలును ఓడిస్తుంది. ప్రస్తుతం కుందేలును ఓడించిన తర్వాత తాబేలులో ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతోంది. బయటకు వచ్చిన వీడియోలో తాబేలు అడవి రాజు సింహాన్ని పట్టుకోవడం కనిపిస్తుంది.

వాస్తవానికి, వైరల్ అవుతున్న క్లిప్‌లో చెరువు ఒడ్డున సింహం నీరు తాగుతున్నట్లు కనిపిస్తుంది. దాని దృష్టి పూర్తిగా తాగునీటిపైనే. అప్పుడే నీటిలో తేలుతున్న తాబేలు ముందుకు వచ్చి సింహాన్ని అక్కడి నుంచి పంపించేందుకు నోటితో దాడి చేస్తుంది.

అప్పుడు సింహం ఆ ప్రదేశం నుంచి దూరంగా వెళ్లి మరోచోట నీరు త్రాగడం మొదలు పెడుతుంది. అయితే తాబేలు ఇక్కడితో ఆగదు. అతను ముందుకు వెళ్లి సింహం వద్దకు చేరుకుంది.. మళ్లీ సింహంతో ఢీకొట్టడం కనిపిస్తుంది. ఈసారి కూడా సింహం స్పందించకపోవడంతో మళ్లీ నీటి కోసం వేరే చోటికి వెళ్లిపోతుంది. వీడియో చూసిన తర్వాత యూజర్లు చాలా ఆశ్చర్యపోతున్నారు.

ఇది పాత వీడియో అయినప్పటికీ.. ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాబేలుకు ఉన్న దైరంను మెచ్చుకుంటున్నారు నెటిజన్లు.

ఇవి కూడా చదవండి: Pranahita Pushkaralu: ఇవాళ్టి నుంచి ప్రాణహిత నది పుష్కరాలు.. మధ్యాహ్నం తర్వాత నదిలోకి పుష్కర పురుషుడు..

Tree City: భాగ్యనగరానికి మరో అరుదైన గుర్తింపు.. రెండోసారి ట్రీ సిటీగా..