Tomato Price Hike: ఓ వైపు ఆకాశన్నంటుతున్న టమాట ధరలు.. మరోవైపు నవ్వులు పూయిస్తున్న మీమ్స్.. ట్రెండింగ్..

|

Nov 24, 2021 | 11:44 AM

Tomato Price funny memes: దేశవ్యాప్తంగా కూరగాయల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. టమాట ధరలు ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అన్ని రాష్ట్రాల్లో టమాట

Tomato Price Hike: ఓ వైపు ఆకాశన్నంటుతున్న టమాట ధరలు.. మరోవైపు నవ్వులు పూయిస్తున్న మీమ్స్.. ట్రెండింగ్..
Tomato
Follow us on

Tomato Price funny memes: దేశవ్యాప్తంగా కూరగాయల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. టమాట ధరలు ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అన్ని రాష్ట్రాల్లో టమాట ధరలు 100కు పైగానే పలుకుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో టమాట ధరలు కిలో రూ.130 నుంచి రూ.150 వరకు ఉన్నాయి. టమాటాలు పెట్రోల్ ధరలు లాగే.. సెంచరీ దాటి దూసుకెళ్తున్నాయంటూ నెట్టింట ట్రెండింగ్ మారింది. ఓ వైపు పెరుగుతున్న నిత్యవసర ధరలు, పెట్రోల్ ధరలను.. మరోవైపు టమాట ధరలను పోలుస్తూ నెటిజన్లు మీమ్స్ షేర్ చేస్తున్నారు. ఈ మీమ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్నాయి. నాకు ఎవ్వరూ పోటీలో లేరంటూ టమాట ఫొటోలను పెట్టి నెటిజన్లు సరదా సంభాషణలను పంచుకుంటున్నారు.

పెట్రోల్, డీజిల్ ధరలు కొంచెం వెనుకపడగా.. టామాట ధరలు ముందంజలో దూసుకెళ్తున్నాయని.. త్వరలో ఉల్లిపాయలు కూడా టమాట స్థానానికి చేరుకుంటాయని ఓ నెటిజన్ ట్విట్ చేశాడు.

Also Read:

Tomato Price Hike: ఏం కొనేటట్లు లేదు.. ఏం తినేటట్లు లేదు.. పెట్రోల్‌ను దాటేసిన టమాటా ధర కిలో రూ.140..