కాఫీ పొడితో ‘గాంధీ బొమ్మ’.. వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన తమిళనాడు టీచర్‌

| Edited By:

Aug 16, 2020 | 9:37 AM

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓ కళాకారుడు కాఫీ పొడితో గాంధీ బొమ్మను రూపొందించారు. దీంతో ఆయన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. 

కాఫీ పొడితో గాంధీ బొమ్మ.. వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన తమిళనాడు టీచర్‌
Follow us on

Gandhi portrait with coffee: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓ కళాకారుడు కాఫీ పొడితో గాంధీ బొమ్మను రూపొందించారు. దీంతో ఆయన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకోనున్నారు.  వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని ఓ స్కూల్‌లో ఆర్ట్‌ టీచర్‌గా పనిచేసే శివరామన్ రాజలింగమ్‌ కాఫీ పొడితో గాంధీ బొమ్మలను వేశారు. తాను పనిచేసే స్కూల్ ఆవరణలో 2020 అడుగుల ప్రదేశంతో గాంధీ 74 ముఖాలను ఆయన రూపొందించారు. ఇందుకోసం శివరామన్ రాజలింగమ్‌కి 22 గంటల 30 నిమిషాల సమయం పట్టింది. దీంతో ఆయన గతంలో ఉన్న ప్రపంచ రికార్డును బ్రేక్ చేశారు. అయితే దీనికి సంబంధించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా శివరామన్ రూపొందించిన గాంధీ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇక దీనిపై శివరామన్‌ మాట్లాడుతూ.. ”ఈ ప్రాజెక్ట్‌పై కరోనా రాకమునుపే నేను గిన్నిస్ వారిని కలిశాను. అయితే ఆ తరువాత పరిస్థితులు మారిపోవడంతో ఆ ఈవెంట్‌ని క్యాన్సిల్‌ చేసుకోవాల్సి వచ్చింది. మా స్కూల్‌ యాజమాన్యం మద్దతు లేకుండా నేను ఈ ఘనతను సాధించలేను” అని అన్నారు.

Read More:

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1102 కొత్త కేసులు.. 9 మరణాలు

హీరోగా ఎన్టీఆర్ బావమరిది!