Tirupati railway police: కదిలే రైలును ఎక్కవద్దని.. అలాగే దిగొద్దంటూ తరచూ రైల్వే శాఖ నిత్యం ప్రచారం చేస్తూనే ఉంటుంది. కానీ చాలా మంది ప్రయాణికులు అలాంటి సూచనలు, సలహాలను పట్టించుకోకుండా ప్రమాదంలో పడుతుంటారు. ఇలాంటి సంఘటనలు ఈ మధ్యకాలంలో చాలా జరుగుతున్నాయి. తాజగా ఓ రైల్వే పోలీసు తన ధైర్య సాహసాలతో ఓ మహిళను ప్రాణాలను కాపాడాడు. ఈ సంఘటన బుధవారం ఉదయం 4.30 గంటలకు తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలు తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి కదులుతోంది. ఇంతలో ఓ మహిళ కదులుతున్న రైలు నుంచి దిగింది. ఈ క్రమంలో ఆమె రైలు కింద పడబోయింది.
ఇది గమనించిన డ్యూటీలో ఉన్న రైల్వే పోలీస్ సతీశ్ ఆమెను పైకి లాగాడు. దీంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. ఈ దృశ్యాలు రైల్వే స్టేషన్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. మహిళను కాపాడిన రైల్వే పోలీస్ సతీశ్‌ను అక్కడున్న వారంతా అభినందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఘటనలో ఆమెకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో బంధువులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. సదరు మహిళ విశాఖ నుంచి తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చినట్లు పేర్కొంటున్నారు. అయితే అప్పుడే నిద్ర నుంచి మేల్కోని.. కదులుతున్న రైలు నుంచి దూకేసినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్లాట్ ఫాంపై విధిలు నిర్వహిస్తూ.. చాకచక్యంగా వ్యవహరించి మహిళ ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్‌ను అధికారులు, ప్రయాణికులు అభినందించారు.
Also Read: