మధ్యప్రదేశ్‌లోని పన్నా టైగర్ రిజర్వ్ పులులకు ఆవాసయోగ్యమైన ప్రాంతం. అయితే ఇప్పుడు తాజాగా అక్కడి నుంచి బయటపడిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. నాలుగు పులి పిల్లలు వాటి తల్లితో వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. కొంతమంది పర్యాటకులు ఆ అడవికి దగ్గర్లో రోడ్డుపై వెళ్తుండగా వారికి ఇవి కనిపించాయి. వీటిని చూసిన పర్యాటకులు వెంటనే తమ ఫోన్‌లో ఈ దృశ్యాలను చిత్రీకరించారు.
ఇదిలా ఉండగా 2009లో పన్నా రిజర్వులో పులల ఆనవాళ్లు కనమరుగవుతున్న సమయంలో ఆ ప్రాంతానికి పులులను తీసుకొచ్చారు. ఆ తర్వాత పులుల సంఖ్య పెరిగింది. నేషనల్ టైగర్ కన్వర్జేషన్ ఆథారిటీ ప్రకారం 2018 లో అత్యధిక పులులకు ఆవాసంగా ఉన్నట్లు మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ ఏడాదికి దాదాపు 526 పులులు ఆ రాష్ట్రంలో ఉన్నాయి. ఇక రెండవ స్థానంలో 524 పులులతో కర్నాటక నిలవగా..మూడవ స్థానాన్ని 442 పులులతో సొంతం చేసుకుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..