ఇటీవల కాలంలో కోతులు జనవాసాల్లోకి రావడం పెరిగిపోయింది. ఆ తర్వాత పలు చోట్ల ఏకంగా పులులు కూడా సంచరిస్తున్నాయి. జనావాసాల్లో పులుల దాడులు కూడా పెరుగుతున్నాయి. అయితే తాజాగా ఓ పులి ఓ గ్రామంలోకి వచ్చి గోవులను, దూడను వెంబడించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశంత నంద ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే ఓ గ్రామంలోని బీడు భూమిలో ఓ పులి గోవులను, ఒక దూడను వెంబడిస్తూ ఉంటుంది. అయితే ఆ గోవులు తప్పించుకోవడంతో అందులో ఉండే దూడ వెంట ఆ పులి పరిగెడుతుంది. కొంతసేపు పరిగిత్తిన తర్వాత చివరికి ఆ దూడను పట్టుకుంటుంది.
కానీ వెంటనే ఓ ఆవు ఆ పులి వైపుకు దూసుకొస్తుంది. అయితే ఆ ఆవుని చూసి పులి భయపడుతుంది. వెంటనే వెనక్కి తిరిగి పారిపోతుంది. ఆ పులి అన్ని గోవులను పరిగిత్తించినప్పటికీ.. ఆ ఆవు దూడను కాపాడేందుకు ధైర్యంగా పులి మీదకు దూసుకొచ్చి ఆ దూడను రక్షిస్తుంది. ప్రస్తుతం ఈ విడయో నెట్టింటా వైరల్ కావడంతో నెటీజన్లు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఇప్పటివరకు దాదాపు 3 వేలకు పైగా పులులు ఉన్నాయి. పులుల సంరక్షణలో ఏళ్ల తరబడి కృషి చేస్తున్నందున వీటి సంఖ్య పెరిగింది.
India now has 75% of world’s wild tigers, numbering around 3200.
It will reach it’s carrying capacity soon, until we are obsessed with numbers & make them pests in human dominated habitats. pic.twitter.com/otdEBjA3AP— Susanta Nanda (@susantananda3) April 22, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..