సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. అడవిలోని జంతువులకు సంబంధించిన వీడియోలుకు చాలా మంది అభిమానులు ఉన్నారు.అవి చేసే పనులు కొన్ని సార్లు భయానికి గురి చేస్తే మరికొన్ని నవ్వులు పూయిస్తాయి. ఈ మధ్య జంతువుల వీడియోలు నెట్టింట తెగవైరల్ అవుతున్నాయి.అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాజాగా వైరల్ అవుతోన్న వీడియో పులికి సంబంధించింది. ఈ వీడియోలో పులి దాని పిల్లలతో చూడొచ్చు. ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత నందా వీడియోను షేర్ చేశారు. ఫుటేజీలో, పిల్లలు తల్లి పులితో కలిసి నడుస్తున్నట్లు చూడవచ్చు.
పులి ఎక్కడికి వెళ్లినా ఆ పిల్లలు దాన్ని వెంబడించడం వీడియోలో చూడవచ్చు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై ఇప్పటికే చాలా మంది స్పందించారు.
తల్లిపులి అడవిలో నడుస్తూ ఉంటే.. వెనక నాలుగు పులి పిల్లలు బుడిబుడి అడుగులు వేస్తూ తల్లిని ఫాలో అవుతూ కనిపించాయి. ఈ వీడియో చూడటానికి చాలా ముచ్చటగా ఉంది. ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.
Cuteness is following your mother ? pic.twitter.com/455FKGOC7p
— Susanta Nanda (@susantananda3) April 28, 2023