AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: జైల్లో విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌కు అనుమానాస్పదంగా కనిపించిన పార్శిల్.. ఓపెన్ చేయగా..

జైల్లోకి వెళ్లి కూడా బుద్ధి మార్చుకోలేదు. అక్కడ కూడా తిక్క వేశాలు వేస్తున్నారు. తాజాగా చైన్నై జైల్లో వెలుగుచూసిన ఓ ఘటన చర్చనీయాంశంగా మారింది. జైలు అధికారులు దీనిపై లోతైన దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Viral: జైల్లో విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌కు అనుమానాస్పదంగా కనిపించిన పార్శిల్.. ఓపెన్ చేయగా..
Suspicious Parcel (representative image)
Ram Naramaneni
|

Updated on: Apr 30, 2023 | 4:26 PM

Share

అందుగలదు.. ఇందు లేదు అని సందేహం వలదు. ఎందెందు వెతికినా అందందే గలదు.. అదేంటో కాదండోయ్. అవును ఇప్పుడు ఎక్కడ వెతికినా గంజాయి గుప్పుమంటుంది. చెక్ పోస్ట్‌లో అనుమానాస్పందంగా కనిపించినా ఏ బండిని ఆపినా.. అందులో ఈ మాల్ కనిపిస్తుంది. పోలీసులు, నార్కోటిక్స్ అధికారులు.. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. దీని అక్రమ రవాణాకు వినియోగానికి ఎండ్ కార్డ్ పడటం లేదు. తాజాగా జైల్లో కూడా గంజాయి పట్టుబడటం కలకలం రేపింది. చైన్నైలో ఈ ఘటన వెలుగుచూసింది. జైలు ఆవరణలో 750 ఎంఎల్ మద్యం సీసాను, 400 గ్రాముల గంజాయిని పుఝల్ జైలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 6వ వాచ్ టవర్ దగ్గర జైలు సిబ్బంది ఈ మత్తు పదార్థాలను గుర్తించారు.

టవర్ పైన విధులు నిర్వహిస్తున్న టీఎస్‌పీ కానిస్టేబుల్‌‌కు ఓ పార్శిల్ కనిపించింది. దాన్ని ఓపెన్ చేయగా లోపల లిక్కర్ బాటిల్, గంజాయి కనిపించాయి. వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని పై అధికారులకు రిపోర్ట్ చేశారు. ఈ ఘటనపై పుజాల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్లాస్టిక్ బాటిల్‌లో మద్యం నింపి, గంజాయిని చిన్న చిన్న పొట్లాల్లో ప్యాక్ చేశారు. జైలు లోపలికి బాటిళ్లు, పార్శిళ్లు ఎలా వచ్చాయన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.

సాధారణంగా జైల్లో సెల్ ఫోన్లు, గంజాయి ప్యాకెట్లను పోలీసులు గతంలో స్వాధీనం చేసుకున్న దాఖలాలు ఉన్నాయి. తొలిసారిగా మద్యం పట్టుబడిన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఘటనను సీరియస్‌గా తీసుకున్న అధికారులు.. జైలు పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. (Source)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

హైదరాబాద్‌లో పట్టపగలే దారుణం.. లాయర్‌ను నరికి చంపిన దుండగులు!
హైదరాబాద్‌లో పట్టపగలే దారుణం.. లాయర్‌ను నరికి చంపిన దుండగులు!
క్వైట్ క్విటింగ్ 2.0.. యూనిఫాంలో ఉన్న బర్న్ అవుట్!
క్వైట్ క్విటింగ్ 2.0.. యూనిఫాంలో ఉన్న బర్న్ అవుట్!
సముద్ర తీరంలో ఉచిత వసతి.. పిల్లుల ప్రేమికులకు ఇది ఒక స్వర్గం!
సముద్ర తీరంలో ఉచిత వసతి.. పిల్లుల ప్రేమికులకు ఇది ఒక స్వర్గం!
అడవిలోనే గంజాయి ఫ్యాక్టరీ.. పోలీసులకే షాకిచ్చిన లిక్విడ్ గ్యాంగ్
అడవిలోనే గంజాయి ఫ్యాక్టరీ.. పోలీసులకే షాకిచ్చిన లిక్విడ్ గ్యాంగ్
ఆయుష్మాన్‌ కార్డ్‌తో ఎన్నిసార్లు రూ.5 లక్షల వైద్యం పొందవచ్చు?
ఆయుష్మాన్‌ కార్డ్‌తో ఎన్నిసార్లు రూ.5 లక్షల వైద్యం పొందవచ్చు?
ఊబకాయంపై వార్ ప్రకటించాల్సిన టైం వచ్చేసింది!
ఊబకాయంపై వార్ ప్రకటించాల్సిన టైం వచ్చేసింది!
ఆ సినిమా బాగుందని అన్నారు.. కానీ ఇంటర్వెల్‏కే దండం పెట్టి వచ్చేసా
ఆ సినిమా బాగుందని అన్నారు.. కానీ ఇంటర్వెల్‏కే దండం పెట్టి వచ్చేసా
జామకాయ పచ్చడి ఇలా చేసి తింటే.. నాన్ వెజ్ కూరలు కూడా సరిపోవు!
జామకాయ పచ్చడి ఇలా చేసి తింటే.. నాన్ వెజ్ కూరలు కూడా సరిపోవు!
260 మందిని బలిగొన్న దుర్ఘటన మరవకముందే.. పెద్ద తప్పు!
260 మందిని బలిగొన్న దుర్ఘటన మరవకముందే.. పెద్ద తప్పు!
పండగలాంటి వార్త..! శివరాత్రి మరుసటి రోజు హాలీడే.. ఉత్తర్వులు జారీ
పండగలాంటి వార్త..! శివరాత్రి మరుసటి రోజు హాలీడే.. ఉత్తర్వులు జారీ