Viral Photo: ఈ ఫొటో తీయడానికి ఏడు గంటలు పట్టిందట.. ఇంతకీ ఈ ఫొటో ప్రత్యేకత ఏంటంటే..

|

Jan 31, 2022 | 8:42 AM

మాటల్లో చెప్పలేని ఎన్నో భావాలను ఫొటోల ద్వారా ప్రతిబించించవచ్చు. అందుకు తగ్గట్లే సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కనిపించే కొన్ని ఫొటోలు మనకు నవ్వు తెప్పిస్తాయి. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి.

Viral Photo: ఈ ఫొటో తీయడానికి ఏడు గంటలు పట్టిందట.. ఇంతకీ ఈ ఫొటో ప్రత్యేకత ఏంటంటే..
Follow us on

మాటల్లో చెప్పలేని ఎన్నో భావాలను ఫొటోల ద్వారా ప్రతిబించించవచ్చు. అందుకు తగ్గట్లే సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కనిపించే కొన్ని ఫొటోలు మనకు నవ్వు తెప్పిస్తాయి. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి. చూపు పక్కకు తిప్పుకోనివ్వకుండా మనల్ని కట్టిపడేస్తాయి. అలా తాజాగా ఓ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్  తన కెమెరాలో బంధించిన ఓ ఫోటో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దీనిని చూసిన వారెవరైనా థ్రిల్ కు గురికావల్సిందే.  ఎందుకంటే ఈ ఫొటోను చూడగానే మనకు  ఒకే చిరుత (Cheetah) మూడు తలలతో ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ ఆ ఫొటోలో ఉన్నది ఆ మూడు చిరుతలు. కెన్యా(Kenya) కు చెందిన పాల్ గోల్డ్ స్టెయిన్ ఈ ఫొటోను తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్తా ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఏడు గంటల పాటు వర్షంలో శ్రమించి..

కాగా ఈ అద్భుతమైన చిత్రాన్ని కెమెరాలో బంధించేందుకు గోల్డ్ స్టెయిన్ సుమారు ఏడు గంటల పాటు వర్షంలో గడపాల్సి వచ్చింది. కెన్యాలోని మసాయి మారా (Maasai Mara) నేషనల్ పార్క్‌లో ఈ ఫొటోను తీశాడు. తన కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇప్పుడు లభిస్తోంది. సోషల్ మీడియాలో ఈ ఫొటోకు అద్భుతమైన స్పందన వస్తోంది. ఫేస్ బుక్ లో ఈ ఫొటోకు వేల సంఖ్యలో లైకులు, వందల సంఖ్యలో షేర్లు రావడం విశేషం.  గోల్డ్ స్టెయిన్టో ఫొటోగ్రఫీ అద్భుతమంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Also Read:Arya- Sayyeshaa: టైటానిక్ ఫోజులో రొమాంటిక్ కపుల్.. నెట్టింట్లో వైరల్ గా మారిన ఫొటో..

30 weds 21: మళ్లీ అలరించేందుకు సిద్ధమైన 30 వెడ్స్ 21.. రెండో సీజన్ కు రంగం సిద్ధం..
Rakul Preet Singh: ఓటీటీలపై మనసుపారేసుకున్న స్టార్ హీరోయిన్.. వెబ్ సిరీస్‏లు చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ..