సముద్ర తీరంలో చిన్నారుల ఆట.. కనిపించిన అరుదైన దృశ్యం.. ఏంటా అని వెళ్లి చూడగా!

|

Mar 15, 2024 | 8:49 PM

సముద్ర తీరం వెంబడి ఉన్న ఇసుకలో కొందరు చిన్నారులు ఎంతో ఉత్సాహంగా ఆటలు ఆడుతున్నారు. ఇంతలో ఆ గ్రూప్‌లోని ఓ చిన్నారికి దూరం నుంచి ఇసుకలో ఏదో ఉన్నట్టు కనిపించింది. అదేంటా అని దగ్గరకు వెళ్లి చూడగా..

సముద్ర తీరంలో చిన్నారుల ఆట.. కనిపించిన అరుదైన దృశ్యం.. ఏంటా అని వెళ్లి చూడగా!
Representative Image
Follow us on

సముద్ర తీరం వెంబడి ఉన్న ఇసుకలో కొందరు చిన్నారులు ఎంతో ఉత్సాహంగా ఆటలు ఆడుతున్నారు. ఇంతలో ఆ గ్రూప్‌లోని ఓ చిన్నారికి దూరం నుంచి ఇసుకలో ఏదో ఉన్నట్టు కనిపించింది. అదేంటా అని దగ్గరకు వెళ్లి చూడగా.. ఎదురుగా కనిపించిన దృశ్యానికి మైమరిచిపోయాడు. ఇంతకీ ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూసేద్దామా..

వివరాల్లోకి వెళ్తే.. తిరువళ్లూరు జిల్లా తిరువల్లంకాడులోని కొసస్తలై నది తీరప్రాంతంలోని ఇసుకలో రాతి మురుగన్ విగ్రహాన్ని కనుగొన్నారు స్థానికులు. ఆ ప్రాంతానికి చెందిన కొంతమంది చిన్నారులు ఇసుకలో ఆడుతుండగా.. వారికి ఈ విగ్రహం దొరికిందని తెలుస్తోంది. అనంతరం స్థానిక తహశీల్దార్ మథియళగన్ నేతృత్వంలోని దేవాదాయ శాఖ అక్కడికి చేరుకున్నారు. ఆ విగ్రహం సుమారు 3.5 అడుగుల ఎత్తు, 150 కిలోల బరువున్నట్టు అధికారులు గుర్తించారు. విగ్రహానికి తలపై కిరీటం, నాలుగు చేతులు, రెండు కాళ్లు ఉన్నాయి. ఈ విగ్రహ నిర్మాణం క్రీ.శ.12వ శతాబ్దానికి చెందినదిగా ఉండవచ్చని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే విగ్రహాన్ని వెలికి తీసిన తహశీల్దార్ మథియాలగన్.. ఆ తర్వాత దాన్ని ప్రజల సందర్శనార్ధం మ్యూజియం అధికారులకు అప్పగిస్తామని చెప్పారు.