Viral Video: బ్యూటీ పార్లర్ లో అందంగా రెడీ అయిన బల్లి.. ఫన్నీ వీడియో పై ఓ లుక్ వేయండి..

|

Aug 20, 2023 | 11:49 AM

ఇటీవల వైరల్ అయిన వీడియోలో ఒక బల్లి బ్యూటీ పార్లర్ లో ఓ రేంజ్ లో మేకప్ వేసుకుని రెడీ అవుతున్నట్లు కనిపిస్తుంది. ఈ వీడియోలో బల్లి తన తలకు మసాజ్ చేయించుకోవడం కనిపించలేదు కానీ.. తన కాళ్లకు ,  పాదాలకు నెయిల్ పెయింట్ వేయించుకున్నట్లు ఖచ్చితంగా కనిపిస్తోంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏంటంటే.. మెడ‌లో బంగారంతో కూడిన చిన్న చైన్ కూడా వేసుకుంది.

Viral Video: బ్యూటీ పార్లర్ లో అందంగా రెడీ అయిన బల్లి.. ఫన్నీ వీడియో పై ఓ లుక్ వేయండి..
Lizard Video Viral
Follow us on

అమ్మాయిలు అందం కోసం ఇచ్చే ఇంపార్టెన్స్.. అందానికి మెరుగులు దిద్దుకోవడానికి చేసే ప్రయత్నాల గురించి రకరకాల ఫన్నీ కామెంట్స్ చేస్తూనే ఉంటారు. అమ్మాయిల వేషధారణ అంటే చాలా ఇష్టమని చెబుతారు. ఎప్పుడైతే ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సి వస్తే.. వెంటనే మేకప్ మొదలు పెడుతుంది. అయితే అందరు అమ్మాయిలు ఇలా చేయకపోయినా.. చాలా మంది అమ్మాయిలు , మహిళలు అందం విషయంలో ఇది జరుగుతుంది. పెళ్లిళ్లలో లేదా పార్టీలలో దాదాపు అందరు అమ్మాయిలు, మహిళల ముఖానికి మేకప్ వేసుకోవడం మీరు తప్పక చూసి ఉంటారు. అయితే ఎప్పుడైనా బల్లి కూడా అందంగా అలంకరించుకోవడం  చూశారా? అవును ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసి మీరు ఆశ్చర్యపోతారు.. అదే సమయంలో నువ్వుకూడా వస్తుంది.

ఇటీవల వైరల్ అయిన వీడియోలో ఒక బల్లి బ్యూటీ పార్లర్ లో ఓ రేంజ్ లో మేకప్ వేసుకుని రెడీ అవుతున్నట్లు కనిపిస్తుంది. ఈ వీడియోలో బల్లి తన తలకు మసాజ్ చేయించుకోవడం కనిపించలేదు కానీ.. తన కాళ్లకు ,  పాదాలకు నెయిల్ పెయింట్ వేయించుకున్నట్లు ఖచ్చితంగా కనిపిస్తోంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏంటంటే.. మెడ‌లో బంగారంతో కూడిన చిన్న చైన్ కూడా వేసుకుంది. వస్త్రధారణను ఇష్టపడే బల్లిని మీరు చాలా అరుదుగా చూసారు. ఇప్పుడు ఆ అందంగా రెడీ అయిన బల్లిని చూస్తే ఎవరైనా షాక్ తింటారు.

ఇవి కూడా చదవండి

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి


ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో kohtshoww అనే ఐడితో షేర్ చేయబడింది.  ఇప్పటివరకు 1.3 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు 45 వేల మందికి పైగా వీడియోను కూడా లైక్ చేసారు. ఫన్నీ రియాక్షన్‌లు కూడా ఇచ్చారు.

బల్లి అందంగా తయారైందని కొందరంటే, ‘బల్లులు కూడా గోళ్లకు రంగు వేసుకోవడానికి ఇష్టపడతాయా అని  కొందరు అంటున్నారు. అదేవిధంగా, మరొక వినియోగదారు ‘ఇప్పుడు బల్లికి లిప్‌స్టిక్‌ను కూడా వేయండి’ అని ఫన్నీ కామెంట్ చేయగా, ‘ఇప్పుడు నేను బల్లులకు భయపడను’ అని ఒకరు రాశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..