Viral Video: ఈ కుక్క యాక్షన్ చూస్తే ఎవరైనా ఫిదా కావాల్సిందే.. సీరియల్స్ నటులకంటే బెటర్ అంటున్న నెటిజన్లు

|

Jul 09, 2023 | 9:21 AM

కుక్కలు తమ యజమానికి ఎంత విధేయత చూపుతాయంటే.. తమ యజమాని కోసం తమ జీవితాలను కూడా త్యాగం చేస్తాయి. అంతేకాదు కుక్కలకు చాలా త్వరగా నేర్చుకునే నేర్పు ఉంటుంది. వాటికి  ఏదైనా నేర్పిస్తే త్వరగా నేర్చుకుంటాయి. ప్రస్తుతం ఒక కుక్కకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో కుక్క అద్భుతంగా నటించింది.

Viral Video: ఈ కుక్క యాక్షన్ చూస్తే ఎవరైనా ఫిదా కావాల్సిందే.. సీరియల్స్ నటులకంటే బెటర్ అంటున్న నెటిజన్లు
Viral Video
Follow us on

ప్రపంచంలో కొన్ని జంతువులు మాత్రమే మానవులకు చాలా దగ్గరగా జీవిస్తాయి. మనుషులతో పాటు  జీవించడానికి ఇష్టపడతాయి. వీటిలో కుక్క ఒకటి. ఇవి అత్యంత విశ్వాసం గల జంతువు. ఇది మానవులను చాలా ప్రేమిస్తుంది. మానవులు కూడా కుక్కలను తమ పిల్లలతో సమానంగా ప్రేమిస్తారు. ప్రపంచంలో ఏదైనా జంతువును ప్రజలు ఎక్కువగా ప్రేమిస్తారు.. పెంచుకుంటారంటే అది కుక్క మాత్రమే. దీనికి అతిపెద్ద కారణం వాటి విధేయత. కుక్కలు తమ యజమానికి ఎంత విధేయత చూపుతాయంటే.. తమ యజమాని కోసం తమ జీవితాలను కూడా త్యాగం చేస్తాయి. అంతేకాదు కుక్కలకు చాలా త్వరగా నేర్చుకునే నేర్పు ఉంటుంది. వాటికి  ఏదైనా నేర్పిస్తే త్వరగా నేర్చుకుంటాయి. ప్రస్తుతం ఒక కుక్కకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో కుక్క అద్భుతంగా నటించింది.

చాలామంది తరచుగా సినిమాలు చూస్తూ ఉంటారు. అందులో ఎవరినైనా కాల్చి చంపితే.. అతను నేలమీద పడి చనిపోతాడు. ఇదే సీన ను వైరల్ అవుతున్న వీడియోలో కుక్క చేసి చూపిస్తుంది. ఒక వ్యక్తి , అతని పెంపుడు కుక్క ముఖాముఖిగా ఉన్నట్లు మీరు వీడియోలో చూడవచ్చు. అప్పుడు ఆ వ్యక్తి తుపాకీ తీసినట్లు నటించి, తన వేళ్లని తుపాకీలా తయారు చేసి తన ముందు నిలబడి ఉన్న కుక్కకి గురి పెట్టి కాల్చాడు. అప్పుడు కుక్క తనకు బుల్లెట్ తగిలినట్లు .. గాయం అయినట్లు నటిస్తూ.. రెండు అడుగులు ముందుకు వేసి మూలుగుతూ నేలపై పడి చనిపోయినట్లు నటించడం ప్రారంభించింది. ఇంత అద్భుతమైన నటనా చాతుర్యం కలిగిన కుక్కను మీరు చాలా అరుదుగా చూసి ఉంటారు.

ఇవి కూడా చదవండి

ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇది ఇన్‌స్టాగ్రామ్‌లో సోలోఫానిమల్స్_ అనే ఐడితో షేర్ చేశారు. ఇప్పటివరకు 4.8 మిలియన్ సార్లు వీక్షించబడింది. 3 లక్షల మందికి పైగా వీడియోను లైక్ చేసారు. వివిధ ఫన్నీ రియాక్షన్‌లు ఇచ్చారు.

‘ఈ కుక్కకి ఆస్కార్ అవార్డ్ ఇవ్వాలి’ అని కొందరంటే, ‘ఇండియన్ టీవీ సీరియల్స్ నటుల కంటే మెరుగ్గా నటిస్తుంది’ అని కొందరు అంటున్నారు. అదే సమయంలో కుక్క నటనను చూసి కొంతమంది  నవ్వుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..