Mystery Island: వేలిముద్ర దీవి మిస్టరీ.. ఈ దీవిని ఏలియన్స్‌ క్రియేట్‌ చేశాయా?.. ఇంట్రస్టింగ్ స్టోరీ మీకోసం..

|

Dec 07, 2021 | 8:39 AM

Fingerprint Island: ఈ ప్రపంచంలో మనిషి ఊహలకు అందని ఎన్నో విచిత్ర ప్రదేశాలున్నాయి. వాటిలో ఒకటి వేలి ముద్ర. దీనినే Fingerprint island అంటారు. యూరప్‌లోని క్రొయేషియాలోని

Mystery Island: వేలిముద్ర దీవి మిస్టరీ.. ఈ దీవిని ఏలియన్స్‌ క్రియేట్‌ చేశాయా?.. ఇంట్రస్టింగ్ స్టోరీ మీకోసం..
Mystery Island
Follow us on

Fingerprint Island: ఈ ప్రపంచంలో మనిషి ఊహలకు అందని ఎన్నో విచిత్ర ప్రదేశాలున్నాయి. వాటిలో ఒకటి వేలి ముద్ర. దీనినే Fingerprint island అంటారు. యూరప్‌లోని క్రొయేషియాలోని అడ్రియాటిక్ సముద్రంలో ఈ దీవి ఉంది. పై నుంచి చూస్తే అచ్చం వేలిముద్రలా కనిపిస్తుంది. దీని చుట్టూ ఉండే ఆకారమే కాదు.. లోపల కూడా వేలి ముద్రపై ఎలా గీతలుంటాయో.. అలాగే ఈ దీవికి గీతలున్నట్లు కనిపిస్తాయి. దీవిలో ఉండే గోడలు.. గీతల్లా కనిపిస్తాయి. స్థానికులు దీన్ని బాల్జెనాక్ అని పిలుస్తారు.

కోడిగుడ్డు ఆకారంలో కనిపించే ఈ దీవి.. 0.14 చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. దీనిలో గోడలు మాత్రం 23 కిలోమీటర్ల పొడవు ఉన్నాయి. చుట్టూ ఉన్న సముద్రం బ్లూకలర్‌లో ఉండగా.. గోడల వల్ల ఇది తెల్లగా కనిపిస్తుంది. చాలా మంది దీన్ని చూశాక ఇదో పురాతన పజిల్ లాంటిది అనుకుంటారు. కానీ.. ఇందులో గోడల్ని జాగ్రత్తగా చూస్తే.. అవి నడుము వరకే వస్తాయి. పజిల్ లా ఉండాలంటే.. గోడలు చాలా ఎక్కువ ఎత్తుతో ఉండాలి. అలా లేవు కాబట్టి.. ఈ గోడలు పజిల్ కోసం నిర్మించినవి కావు. మరైతే ఎందుకు నిర్మించారు.. ఎవరు నిర్మించారు?

అయితే ఈ దీవిని అసలు ఎవరు నిర్మించారన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. అంత ఎత్తైన గోడలు నిర్మించింది ఏలియన్సే అన్న వాదన కూడా ఉంది. అందువల్ల వీటిని ఏలియన్స్ నిర్మించి ఉంటారని స్థానికుల్లో కొందరు నమ్ముతుంటారు. అదే నిజమైతే.. కొన్ని ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంటుంది. ఏలియన్స్ ఉన్నారా.. ఉంటే ఎక్కడున్నారు.. ఈ దీవిలోనే గోడలు ఎందుకు నిర్మించారు.. దీని వల్ల వారికి లాభమేంటి.? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం లేదు. పైగా.. ఏలియన్స్ నిర్మించారు అనేందుకు కూడా ఆధారాలు లేవు.

Also read:

Omicron: ‘సూపర్ మైల్ట్‌’ వేరియంట్‌గా ఒమిక్రాన్.. టార్గెట్‌గా మారిన యువత.. పొంచి ఉన్న భారీ ముప్పు.. నిపుణులు ఏమంటున్నారంటే?

Putin in India: భారత రష్యా సంబంధాలకు బూస్టర్ డోస్ ఇచ్చిన పుతిన్ పర్యటన.. వాణిజ్య బంధాలపై పలు ఒప్పందాలు!

Zoom Call: సర్‌ప్రైజ్‌ ఇస్తాడనుకుంటే.. షాకిచ్చాడు.. మూడు నిమిషాల్లో 900 మంది ఔట్‌!